saibaba1
September 19, 2014 | by admin
శ్రీ సాయి లీల సుగంధ పరిమళాలు-1

శ్రీ సాయి లీల సుగంధ పరిమళాలు-1                                                                                            ——–మోపూరు పెంచల నరసింహం      […]

శ్రీ సాయి లీల సుగంధ పరిమళాలు-1   

                                                                                        ——–మోపూరు పెంచల నరసింహం 

 

        బాల సాయి దర్శనము
 షిరిడి లో వేప చెట్టు saibaba1
సాయి చరిత్రలో తొలిమెట్టు 
అది గురుస్థానము 
అది బాల సాయి తపో కేంద్రము 
ఆ చెట్టు క్రింద 
అగుపించాడు 
పదహారేళ్ళ దివ్య బాలకుడు 
కళ్ళు నీలి వర్ణము లో వెలుగుచుండెను 
దేహము పసిడి కాంతులతో మెరియుచుండెను 
నిరతము ఆత్మధ్యానములో మునిగి ఉండెను 
గురుస్థానము 
గణాచారి చెప్పగా 
ప్రజలు అట త్రవ్వగా 
అగుపించెను ఒక  భూ గృహం
వెలుగుచుండెను  జ్యోతుల దివ్య తేజం 
భిక్షకు వెళ్ళిన బాలుడు వచ్చెను 
అది తన గురుస్థానమని చెప్పెను 
యధా ప్రకారం దానిని మూసివేసేసెను 
అట నేడు సాయి పాదాలు వెలసెను.
808 Comments
Leave a Reply

— required *

— required *