కొబ్బరి నీళ్ళతో ఉపయోగాలు

           కొబ్బరి నీళ్ళతో ఉపయోగాలు

 ఎండలు మండి పోతున్నాయి.దాహం తీర్చడానికి కొబ్బరి బొండాలు సిద్దంగా వున్నాయి.కాని మనలో ఎక్కువ మంది చల్లగా కూల్ డ్రింక్స్ ఇష్టపడతాము కాని కొబ్బరి బొండాం తాగము .ఈ కూల్ డ్రింక్స్ వలన దాహం తీరకపోగా అనారోగ్యం కలగజేస్తుంది.మనకు ఆరోగ్యం బాలేనప్పుడు డాక్టర్ ,కొబ్బరి నీళ్ళు తాగమంటాడు కాని కూల్ డ్రింక్స్ తాగమనరు. కొబ్బరి నీటిని ఏ కాలంలో అయినా అందరూ తాగవచ్చు. మామూలు రోజుల్లో ఎలా ఉన్నా వేసవిలో మాత్రం రోజుకు ఒక కొబ్బరి బొండం తాగితే వేసవి రుగ్మతల నుంచి రక్షణ లభిస్తుంది. బలహీనంగా ఉన్న వ్యక్తికి గ్లూకోజ్ దొరకనప్పుడు డ్రిప్స్‌గా కొబ్బరి నీళ్ళను ధారాళంగా వాడతారు. ఈ నీళ్ళు శరీరంలోని వేడిని తగ్గించి కావలసిన చల్లదనాన్ని ఇస్తాయి. ఇది దప్పికను తీరుస్తుంది. కొబ్బరి నీటిలో కొలెస్ట్రాల్ శాతం తక్కువ గా వుంటుంది.. కొబ్బరి నీళ్ళలో విటమిన్లు, మినరల్సు, ఎలక్ట్రో లైట్స్, ఎంజైమ్ లు, ఎమినో యాసిడ్లు, సైటోకిన్ అధికంగా ఉన్నాయి. 
కొబ్బరి నీళ్ళ వలన ఉపయోగాలు ఇప్పుడు చూద్దాము.

  • గ్యాస్ సమస్యలు, కడుపులో మంట, అల్సర్ ను తగ్గిస్తుంది.
  • మూత్రంలో మంట, ఇన్ఫెక్షన్ వంటి వాటిని తగ్గిస్తుంది. అలాగే కిడ్నిలలో రాళ్ళను కరిగిస్తుంది.
  • మలబద్దకాన్ని నివారిస్తుంది.
  • • చర్మానికి మంచి నిగారింపునిచ్చి, స్కిన్ ఇన్ఫెక్షన్ లేకుండా చేస్తుంది. రక్త శుద్ధిలో కొబ్బరి నీళ్ళ పాత్ర ఆమోఘం ఒక్క మాటలో చెప్పాలంటే కొబ్బరి నీరు గ్లాసు పాలకంటే కూడా పుష్టికరం.
  • పైగా ఇందులో తల్లిపాలలో ఉండే లారిక్‌యాసిడ్‌ లాంటి సుగునాలన్నీ కూడా కలగలిసి ఉన్నాయి.
  • చక్కెర పదార్థాలు, ఖనిజలవణాలు విటమిన్లతో సమృద్ధమైన కొబ్బరి నీరు ఎంత అలసటనైనా సరే ఇట్టే పోగొట్టేస్తుంది.
  • కమిలిపోయి పొడిబారిపోయినట్లుండే చర్మానికి కొబ్బరి నీళ్లు మంచి మందు. కొబ్బరి నీళ్ళలో దూదిని ముంచి ముఖానికి రాస్తే మంచి ఫలితం ఉంటుంది.
  • వేసవి కాలంలో ప్రతిరోజు  అల్పాహారానికి ముందు లేత కొబ్బరినీళ్ళు తాగితే  అంతర్గత గాయాలు త్వరగా మానిపోతాయి.
  • లేత కొబ్బరినీళ్ళను ఆరు నెలల పాటు రాస్తుంటే స్మాల్‌పాక్స్‌ మచ్చలు పోయే అవకాశం ఉంది.
Theme by Design-Destination, powered by Design-Destination.