మెగా స్టార్ @60
August 21, 2015 | by admin
మెగా స్టార్ @60

మెగా స్టార్ @60 మెగా స్టార్ కి 60 ఏళ్ళు.హీరో కావాలని అతని “అభిలాష”.”పునాది రాళ్ళ”తో పునాది.’ఖైది” తో కోట్లాది అభిమానుల గుండెల్లో ఖైది. కోట్లాది మనసులను దోచిన “మంచి దొంగ” . మహిళల అభిమానం చూరగొన్న “మగ మహారాజు ”.”ఆరాధన”చేసి “రుద్రవీణ”ను పలికించి “రుద్ర నేత్రుడై”…”త్రినేత్రుడై”…”స్వయం కృషి” తో “విజేత” అయిన “టాగూర్”. తెలుగు సినిమా స్టామినాని ప్రపంచానికి చెప్పిన హీరో మెగాస్టార్ చిరంజీవి.బాలివుడ్ సినిమా ఆరు,ఏడు కోట్లు వసూలు చేస్తున్న సమయం లో “ఘరానా […]

మెగా స్టార్ @60

మెగా స్టార్ కి 60 ఏళ్ళు.హీరో కావాలని అతని “అభిలాష”.”పునాది రాళ్ళ”తో పునాది.’ఖైది” తో కోట్లాది అభిమానుల గుండెల్లో ఖైది. కోట్లాది మనసులను దోచిన “మంచి దొంగ” . మహిళల అభిమానం చూరగొన్న “మగ మహారాజు ”.”ఆరాధన”చేసి “రుద్రవీణ”ను పలికించి “రుద్ర నేత్రుడై”…”త్రినేత్రుడై”…”స్వయం కృషి” తో “విజేత” అయిన “టాగూర్”.

తెలుగు సినిమా స్టామినాని ప్రపంచానికి చెప్పిన హీరో మెగాస్టార్ చిరంజీవి.బాలివుడ్ సినిమా ఆరు,ఏడు కోట్లు వసూలు చేస్తున్న సమయం లో “ఘరానా మొగుడు “ప్రాంతీయ సినిమా ద్వారా పది కోట్లు వసూలు చేసి,హిందీ చిత్ర పరిశ్రమ ఆశ్చర్య పోయేలా చేసిన హీరో చిరంజీవి.కోటి రూపాయలు పారితోషికం తీసుకున్న మొదటి భారతీయ హీరో మెగాస్టార్ చిరంజీవి.నటుడి గా ఎన్నో మైలు రాళ్ళు అందుకున్న చిరంజీవి ,రాజకీయ నాయకుడిగా మాత్రం విఫలం  అయ్యారు.”ప్రజా రాజ్యం”పార్టీ స్థాపించి కల్సి రాక కాంగ్రెస్ లో విలీనం చేసి కేంద్ర మంత్రి అయ్యారు.ప్రస్తుతం రాజ్య సభ సభ్యులు గా వున్నారు.ఏడు సంవత్సారాలుగా సినిమాలు మానేసిన చిరంజీవి 150 వ సినిమా చేయబోతున్నరనే వార్త అభిమానులను ఆనంద డోలికల్లో ముంచెత్తుతుంది.ఆగస్ట్ 22 చిరంజీవి అరవయ్యో వడిలోకి ప్రవేశించబోతున్నారు.ఆయన మరిన్ని విజయ శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ జన్మ దిన శుభాకాంక్షలు ..

898 Comments