దీపావళి శుభాకాంక్షలు
November 11, 2015 | by admin
దీపావళి శుభాకాంక్షలు

దీపావళి శుభాకాంక్షలు దీపావళి పండగ ముందు జరుపుకునేది “నరక చతుర్దశి”.దీనికి సంబంధించి ఒక పురాణ గాథ వుంది.హిరణ్యాక్షుడు భూ మండలాన్ని చుట్టి సంద్రం లో ముంచినప్పుడు ,శ్రీ మహా విష్ణువు “వరాహ”అవతారం ఎత్తి హిరణ్యాక్షుడిని చంపి భూదేవిని కాపాడాడు.ఈ సందర్భం లో భూమాతకు విష్ణు వర ప్రసాదంగా ఒక కుమారుడు జన్మించాడు.ఇతనే కాల గమనం లో  నరకాసురిడిగా పేరొందాడు.ప్రాగ్జ్యోతిష్య పురాన్ని రాజదానిగా చేసుకొని పరిపాలన సాగించేవాడు.అసుర స్వభావం ఎక్కువగా వున్న నరకుడు ఘోర తపస్సు చేసి,తల్లి చేతిలో […]

దీపావళి శుభాకాంక్షలు

దీపావళి పండగ ముందు జరుపుకునేది “నరక చతుర్దశి”.దీనికి సంబంధించి ఒక పురాణ గాథ వుంది.హిరణ్యాక్షుడు భూ మండలాన్ని చుట్టి సంద్రం లో ముంచినప్పుడు ,శ్రీ మహా విష్ణువు “వరాహ”అవతారం ఎత్తి హిరణ్యాక్షుడిని చంపి భూదేవిని కాపాడాడు.ఈ సందర్భం లో భూమాతకు విష్ణు వర ప్రసాదంగా ఒక కుమారుడు జన్మించాడు.ఇతనే కాల గమనం లో  నరకాసురిడిగా పేరొందాడు.ప్రాగ్జ్యోతిష్య పురాన్ని రాజదానిగా చేసుకొని పరిపాలన సాగించేవాడు.అసుర స్వభావం ఎక్కువగా వున్న నరకుడు ఘోర తపస్సు చేసి,తల్లి చేతిలో తప్ప ఇంకెవరి చేతిలో మరణం లేకుండా వరం పొందాడు.వర గర్వం తో ప్రజలను,మునులని హింసించేవాడు.దేవతలను,గంధర్వులను చేరబట్టిన నరకుడి శ్రీ కృష్ణుడు ,సత్యభామ దండెత్తారు.నరకుడు వేసిన అస్త్రానికి శ్రీ కృష్ణుడు మూర్చిల్లినట్టు భ్రమింప చేసాడు.దాంతో సత్యభామ వుగ్రురాలై నరకుడిని సంహరిచింది.నరకాసురిడి పీడ విరగడ అయినందుకు ప్రజలు మరుసటి రోజు సంభరాలు చేసుకున్నారు.ఆ రోజు అమావాస్య కావడం ,చీకటిని పారద్రోలుతూ దీపాలు వెలిగించి ,బాణా సంచా కాల్చడం తో కాలక్రమమంలో అదే దీపావళి అయ్యింది.

భారతీయ పండగలలో జాతి,కుల,మత,వర్గ విభేదాలను విస్మరించి అందరు ఆనందంగా జరుపుకునే పండగ దీపావళి.దీప అంటే దీపం .ఆవళి అంటే వరస అని అర్థం.అమావాస్య చీకట్లను పారద్రోలి వెలుగు తెచ్చే పండగగా ,విజయానికి ప్రతీకగా జరుపుకుంటారు.దీపావళి నాడు ఇళ్ళను దీపాలతో వెలిగించడం వలన మహాలక్ష్మి కృపా కటాక్షాలు లబిస్తాయని విశ్వాసం.టపాసులు పేల్చడం వల్ల శబ్దాలు ,వెలుగులతో దారిద్ర్యం ,తొలగిపోతుందని నమ్మకం. అంతే కాకుండా వర్ష రుతువులో ఏర్పడ్డ తేమ వలన పుట్టుకొచ్చే క్రిమి,కీటకాదులు బాణా సంచాపొగలకు నశిస్తాయి.

562 Comments
Leave a Reply

— required *

— required *

Theme by Design-Destination, powered by Design-Destination.