Dasari-Narayana-Rao
May 31, 2017 | by admin
దర్శక దిగ్గజం “దాసరి”కన్ను మూత

దర్శక దిగ్గజం “దాసరి”కన్ను మూత బహుముఖ ప్రజ్ఞాశాలి, మహా దర్శకుడు, నటుడు, రచయిత, ప్రయోక్త, సామాజిక ఉద్యమకారుడు, పత్రికాధిపతి దాసరి నారాయణ రావు (72) కన్నుమూశారు. కిమ్స్‌ ఆస్పత్రిలో మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో శాశ్వత నిద్రలోకి వెళ్లారు.ఆయనకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని తోల్‌కట్ట వద్ద ఉన్న దాసరి ఫాంహౌజ్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నాలుగేళ్ల క్రితం ఆయన భార్య […]

Summary:


దర్శక దిగ్గజం “దాసరి”కన్ను మూత
బహుముఖ ప్రజ్ఞాశాలి, మహా దర్శకుడు, నటుడు, రచయిత, ప్రయోక్త, సామాజిక ఉద్యమకారుడు, పత్రికాధిపతి దాసరి నారాయణ రావు (72) కన్నుమూశారు. కిమ్స్‌ ఆస్పత్రిలో మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో శాశ్వత నిద్రలోకి వెళ్లారు.ఆయనకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని తోల్‌కట్ట వద్ద ఉన్న దాసరి ఫాంహౌజ్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నాలుగేళ్ల క్రితం ఆయన భార్య దాసరి పద్మ అంత్యక్రియలు కూడా ఇదే ఫాంహౌస్‌లో నిర్వహించారు. దాసరి మృతి పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, సినీరంగ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు. అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించాలని సీఎం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.151 సినిమాలకు దర్శకత్వం.. నిర్మాతగా 53, రచయితగా 250 సినిమాలకు పని చేసారు.కోడి రామకృష్ణ,రవిరాజ పినిసెట్టి లాంటి ఎందరో దర్శకులని మరియు మురళి మోహన్,మోహన్ బాబు లాంటి నటులని పరిచయం చేసారు.దాసరి తాతా మనుమడు సినిమాతో దర్శకునిగా తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి సుప్రసిద్ధ నటీనటులకు హిట్ చిత్రాలనందించిన దాసరి రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. రాజ్యసభ సభ్యునిగా, కేంద్ర మంత్రిగా సేవలందించారు

Leave a Reply

— required *

— required *

Theme by Design-Destination, powered by Design-Destination.