'స్టార్' సినిమాలు సేఫ్ కాదా ?
January 17, 2015 | by admin
‘స్టార్’ సినిమాలు సేఫ్ కాదా ?

‘స్టార్’ సినిమాలు సేఫ్  కాదా ? ఇటివలి కాలం లో పెద్ద హీరోలు,భారి బడ్జెట్ సినిమాలు కొన్న బయ్యర్స్ హడలి చస్తున్నారు. వారి పరిస్థితి జూదం కన్నా దారుణంగా తయారు  అయ్యింది.తెలుగు లో ‘ఆగడు ‘ ‘రభస’ లను  కొన్నబయ్యర్స్ కి  భారి నష్టాలను మిగిల్చాయి. ఇక సూపర్ స్టార్ రజని కాంత్ నటించిన ‘లింగ’బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది.ఈ సినిమాను కొన్న వాళ్ళు రోడ్ మీద పడ్డారు. నష్ట పరిహారం ఇప్పించమని రజని కాంత్ ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. సినిమా నష్టానికి నటులకి సంబంధం లేదని […]

‘స్టార్’ సినిమాలు సేఫ్  కాదా ?

ఇటివలి కాలం లో పెద్ద హీరోలు,భారి బడ్జెట్ సినిమాలు కొన్న బయ్యర్స్ హడలి చస్తున్నారు. వారి పరిస్థితి జూదం కన్నా దారుణంగా తయారు  అయ్యింది.తెలుగు లో ‘ఆగడు ‘ ‘రభస’ లను  కొన్నబయ్యర్స్ కి  భారి నష్టాలను మిగిల్చాయి. ఇక సూపర్ స్టార్ రజని కాంత్ నటించిన ‘లింగ’బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది.ఈ సినిమాను కొన్న వాళ్ళు రోడ్ మీద పడ్డారు. నష్ట పరిహారం ఇప్పించమని రజని కాంత్ ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. సినిమా నష్టానికి నటులకి సంబంధం లేదని నిర్మాతను అడగండి అంటూ ‘తమిళ నటుల సంఘం సదరు బయ్యర్స్ కి వార్నింగ్ ఇచ్చింది.185 కోట్ల బడ్జెట్ తో విడుదల అయిన శంకర్ ‘ఐ’ సినిమా  మొదటి రోజే  నెగటివ్ టాక్ రావడం తో కొన్నబయ్యర్స్  గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి.ఇక తెలుగు లో’మల్టీ స్టారర్’సినిమా గా  వచ్చిన ‘గోపాల గోపాల’సినిమా సంక్రాంతి సెలవుల తరువాత పరిస్థితి ఎలా ఉంటుందోనని  బయ్యర్స్ ఆందోళన చెందుతున్నారు. ఈ సినిమాకు భారి ఓపెనింగ్స్ వచ్చాయి అంటే దానికి కారణం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వల్లే .ఎంత పెద్ద హీరో,పెద్ద బడ్జెట్,పెద్ద డైరెక్టర్స్ సినిమా అయినా  ఓపెనింగ్స్ వరకే వాళ్ళ పేరు ఉపయోగ పడుతుంది.తరువాత సినిమా రన్ అవ్వాలంటే  సినిమాలో విషయము ఉండాల్సిందే.   లేకుంటే పెద్ద హీరోల సినిమాలు కొనడానికి ఎవరు రారు.    
670 Comments