సూక్తి 'రత్నా'వళి
March 1, 2015 | by admin
సూక్తి ‘రత్నా’వళి -4

సూక్తి ‘రత్నా’వళి  -4 —సేకరణ వి.వి. రత్నం [నెల్లూరు]      1.ఎవరు ఎవరు ఫై ఆధార పడ వద్దు. మనం చీకట్లో వున్నప్పుడు మన నీడ కూడా మన వెంట ఉండదు.        2. దూరం గా ఉన్న వృక్షాలు పెరిగే కొద్ది దగ్గరవుతాయి.దగ్గరగా వున్న మనుషులు పెరిగే కొద్ది దూరం అవుతారు.       3.జన్మనిచ్చిన తల్లిని ,జన్మ భూమిని ప్రేమించలేని వ్యక్తి దేనిని ప్రేమించలేడు .    4.అరణ్యంలో జంతువులు వాటి సహజ ముఖాలతో దర్సనమిస్తాయి. జనారణ్యం లో ఏది […]

సూక్తి ‘రత్నా’వళి  -4 —సేకరణ వి.వి. రత్నం [నెల్లూరు]    

 1.ఎవరు ఎవరు ఫై ఆధార పడ వద్దు. మనం చీకట్లో వున్నప్పుడు మన నీడ కూడా మన వెంట ఉండదు.      

 2. దూరం గా ఉన్న వృక్షాలు పెరిగే కొద్ది దగ్గరవుతాయి.దగ్గరగా వున్న మనుషులు పెరిగే కొద్ది దూరం అవుతారు.     
 3.జన్మనిచ్చిన తల్లిని ,జన్మ భూమిని ప్రేమించలేని వ్యక్తి దేనిని ప్రేమించలేడు .  
 4.అరణ్యంలో జంతువులు వాటి సహజ ముఖాలతో దర్సనమిస్తాయి. జనారణ్యం లో ఏది కుక్కో ,ఏది నక్కొ ,ఏది పులో తెలుసుకోవడం కష్టం.   
 5. కోట్లు సంపాదించే కొడుకు కన్నా,తల్లి కంట కన్నీరు రాకుండా చూసుకునే కొడుకే మిన్న.    
 6.తనకు అన్ని తెలుసు అనుకోవడం అహంకారం . ఎదుటి వారికి ఏమి తెలియదు అనుకోవడం అజ్ఞానం.  .    
 7. నమ్మిన వారిని మోసం చేయటం పాపం.    . 
 8.ధనం లో నీ కన్నా తక్కువ వాడితో ,గుణం లో నీ కన్న ఎక్కువ వాడితో పెట్టుకో .      
 9.సంపాదించినంత కాలం అందరూ  ఆత్మీయులే ,సంపాదించ లేనప్పుడు నీవు కూడా బయటి వాడివే 
10.మంచి వక్తవు కావాలంటే ,ముందు మంచి శ్రోతవు కావాలి . 
673 Comments
Leave a Reply

— required *

— required *