సూక్తి 'రత్నా'వళి
February 14, 2015 | by admin
సూక్తి ‘రత్నా’వళి -2

సూక్తి ‘రత్నా’వళి   —సేకరణ వి.వి. రత్నం [నెల్లూరు]    1. కల్తి, వస్తువుల లోనే కాదు,ప్రస్తుత సమాజం లో నవ్వే నవ్వులో కల్తి ,ఏడ్చే ఏడుపులో కల్తీ.     2. మనిషి ఆవేశం గా  మాట్లాడితే మానవత్వాన్ని కోల్పోతారు.    3.కొరివి పెట్టేది కొడుకు.కూడు పెట్టేది కూతురు.       4. నేటి యువత అంతర్జాలం లో అంతర్లీనమై,భాద్యతలను మరిచి పోతున్నారు.       5. అమ్మానాన్నలకు ముసలి తనం లో ఆసరాగ వుండాలి కాని, వ్రుద్దశ్రమం  లో చేర్పిస్తే మీ పిల్లలు కూడా మీకు అదే పని […]

సూక్తి ‘రత్నా’వళి   —సేకరణ వి.వి. రత్నం [నెల్లూరు]  

 1. కల్తి, వస్తువుల లోనే కాదు,ప్రస్తుత సమాజం లో నవ్వే నవ్వులో కల్తి ,ఏడ్చే ఏడుపులో కల్తీ.   

 2. మనిషి ఆవేశం గా  మాట్లాడితే మానవత్వాన్ని కోల్పోతారు.  
 3.కొరివి పెట్టేది కొడుకు.కూడు పెట్టేది కూతురు.     
 4. నేటి యువత అంతర్జాలం లో అంతర్లీనమై,భాద్యతలను మరిచి పోతున్నారు.     
 5. అమ్మానాన్నలకు ముసలి తనం లో ఆసరాగ వుండాలి కాని, వ్రుద్దశ్రమం  లో చేర్పిస్తే మీ పిల్లలు కూడా మీకు అదే పని చేస్తారు.    
 6.ఆసరాగ చెయ్యి అందిస్తే ఫైకి రా  అంతే కాని ఆసరా ఇచ్చిన వారిని అగాథం లోకి తొయ్యకు.    
 7. చిలకలు పంజరం లో వుంటాయి.కాకులు స్వేచ్చగా విహరిస్తుంటాయి. మంచి మనిషికే కస్టాలు ఎదురు అవుతుంటాయి.      
 8. సంతోషం గా వుంటే ఆయూరారోగ్యాలు వుంటాయి.   
 9. కోతులు చెట్టు ఫై వుంటాయి. ఏనుగులు భువి లో వుంటాయి. ఫై నున్న మాత్రాన కోతులు గొప్ప కాదు. ఏనుగులు అల్పం కాదు.     
10. అబద్దాలు చెప్పేవాడికి శిక్ష ఏమిటంటే ,వాడు నిజం చెప్పిన నమ్మరు.    
922 Comments