సూక్తి 'రత్నా'వళి -3
February 21, 2015 | by admin
సూక్తి ‘రత్నా’వళి -3 —సేకరణ వి.వి. రత్నం

సూక్తి ‘రత్నా’వళి   —సేకరణ వి.వి. రత్నం [నెల్లూరు]      1.జీవితం అంటే ఒక సమస్యని పరిష్కరించుకుని మరొక సమస్యలోకి అడుగు పెట్టడమే.      2. గ్రహ బలాన్ని నమ్మకు.ఆత్మ బలాన్ని నమ్ముకో ,జీవితం లో ఫైకి వస్తారు.         3.ఎప్పుడు ఇద్దరికీ కోపం తెప్పించకు ,ఒకటి దేవుడు ,ఇంకొకరు డాక్టర్ దేవుడికి కోపం వస్తే ,డాక్టర్ దగ్గరికి పంపిస్తాడు. డాక్టర్ కి కోపం వస్తే దేవుడి దగ్గరికి పంపిస్తాడు.     4. జీవితం తీపి చేదుల సమ్మిళిత గుళిక ,రెంటిని సమ […]

సూక్తి ‘రత్నా’వళి   —సేకరణ వి.వి. రత్నం [నెల్లూరు]    

 1.జీవితం అంటే ఒక సమస్యని పరిష్కరించుకుని మరొక సమస్యలోకి అడుగు పెట్టడమే.    

 2. గ్రహ బలాన్ని నమ్మకు.ఆత్మ బలాన్ని నమ్ముకో ,జీవితం లో ఫైకి వస్తారు.       
 3.ఎప్పుడు ఇద్దరికీ కోపం తెప్పించకు ,ఒకటి దేవుడు ,ఇంకొకరు డాక్టర్ దేవుడికి కోపం వస్తే ,డాక్టర్ దగ్గరికి పంపిస్తాడు. డాక్టర్ కి కోపం వస్తే దేవుడి దగ్గరికి పంపిస్తాడు.   
 4. జీవితం తీపి చేదుల సమ్మిళిత గుళిక ,రెంటిని సమ పాలల్లో స్వీకరించాలి.       
 5. ఏ వ్యక్తికి అయినా అధికారం వచ్చిన తరువాత అతని నిజ స్వరూపం బయట పడుతుంది.  
 6.జీవితం లో ఏది శాశ్వతం కాదు , చివరకు మిగిలేది పంచ భూతాలే.   .    
 7. జీవితం లో నీ ప్రమేయం లేకుండా జరిగేవి రెండు ఒకటి పుట్టుక ,ఇంకోటి చావు      . 
 8.చేతి వ్రేళ్ళు ఒకటిగా ఉండనట్టే ,ఒక తల్లి కడుపునా పుట్టిన వారి ప్రవర్తన ఒకటిగా ఉండదు.     
 9.వంద మంది డాక్టర్లు నీ వెంట వున్నా , మృత్యువును ఎవరు ఆపలేరు . 
10. మీకు వచ్చే ఆదాయాన్ని ఒక పద్దతిగా ఖర్చు పెట్టండి అప్పు చెయ్యడానికి ప్రయత్నించ వద్దు . అప్పు చేసే వారికి సమాజం లో విలువ లేదు.  
361 Comments
Leave a Reply

— required *

— required *

Theme by Design-Destination, powered by Design-Destination.