సింగీతం శ్రీనివాసరావు
September 21, 2015 | by admin
సింగీతం బర్త్ డే స్పెషల్

సింగీతం బర్త్ డే స్పెషల్  — నాగ త్రినాథ్ యడవిల్లి. సింగీతం శ్రీనివాసరావు ……84 ఏళ్ళ ఈ గూడూరు చిన్నోడి పేరు వింటే ఈయన మన తెలుగు వాడని గర్వంతో చాతీ రెండగుళాలు ఉబ్బుతుంది. తల్లినుండి సంగీత జ్ఞానం, తండ్రినుండి సెన్సాఫ్ హ్యూమర్ వారసత్వంగా పొంది టీచర్ గా తన జీవికను ప్రారంభించి, ఎన్నో నాటకాల్లో నటించిన సింగీతం హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయ, కే.వీ. రెడ్డి, పింగళి నాగేంద్రరావు వంటి దిగ్గజాలదగ్గర అసోసియేట్ డైరెక్టర్ గా, గాయకుడిగా పనిచేసి […]

సింగీతం బర్త్ డే స్పెషల్  — నాగ త్రినాథ్ యడవిల్లి.

సింగీతం శ్రీనివాసరావు ……84 ఏళ్ళ ఈ గూడూరు చిన్నోడి పేరు వింటే ఈయన మన తెలుగు వాడని గర్వంతో చాతీ రెండగుళాలు ఉబ్బుతుంది. తల్లినుండి సంగీత జ్ఞానం, తండ్రినుండి సెన్సాఫ్ హ్యూమర్ వారసత్వంగా పొంది టీచర్ గా తన జీవికను ప్రారంభించి, ఎన్నో నాటకాల్లో నటించిన సింగీతం హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయ, కే.వీ. రెడ్డి, పింగళి నాగేంద్రరావు వంటి దిగ్గజాలదగ్గర అసోసియేట్ డైరెక్టర్ గా, గాయకుడిగా పనిచేసి 1972 లో ‘నీతి నిజాయతీ’ తెలుగు చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేసారు. 1976 లో ‘అమెరికా అమ్మాయి’ సినిమాలో అమెరికన్ ఆర్టిస్ట్ తో సినిమా తీసి అందర్నీ మెప్పించారు. 1977 లో ‘తరం మారింది’ చిత్రానికి గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి నంది అవార్డు అందుకున్నారు. అలాగే1984 లో తమిళంలో ఆయన తొలి చిత్రం ‘దిక్కట్ర పార్వతి’( ‘రాజాజీ’ చక్రవర్తుల రాజగోపాలాచారిగారి రచన ) జాతీయ ఉత్తమ చిత్రం, ఉత్తమ తమిళ చిత్రం (ఫిలిం ఫేర్) అవార్డులు అందుకున్నారు. ఈ రెండు చిత్రాలూ ఇండియన్ నేషనల్ ఫిలిం ఫెస్టివల్ , మాస్కో ఫిలిం ఫెస్టివల్ లలో ప్రదర్శితమయ్యాయి. 1982 లో తన స్వీయరచనా, దర్శకత్వంతో కన్నడ కథానాయకుడు రాజ్ కుమార్ తో కలిసి ‘హాలు జేను’ చిత్రాన్ని నిర్మించి కర్ణాటక ప్రభుత్వ రాష్ట్ర పురస్కారాన్ని అందుకున్నారు.. 1984 లో ప్రముఖ నర్తకి , నటి సుధాచంద్రన్ తో ‘మయూరి’ చిత్రాన్ని తీసి అనేకమంది విమర్శకుల ప్రసంశలతోబాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఉత్తమచిత్రం, దర్శకత్వం, స్క్రీన్ ప్లే విభాగాల్లో నంది అవార్డు అందుకున్నారు.
టాకీల కాలంలో కమల్ హాసన్ తో సింగీతం చేసిన గొప్ప ప్రయోగం “పుష్పకవిమానం” (1984)మూకీ చిత్రం. జాతీయ స్థాయిలో ఉత్తమ విదోదాత్మక చిత్రంగా , కన్నడ భాషలో ఉత్తమ చిత్రంగా (ఫిలిం ఫేర్) నిలిచి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శితమైందీ చిత్రం.
1989 లో కమల్ హాసన్ తోనే(కమల్ హాసన్ త్రిపాత్రాభినయం . ఒక పాత్ర మరుగుజ్జు) మరో ప్రయోగాత్మక చిత్రం ‘అపూర్వ సహోదరగళ్’ తీసి ఉత్తమ తమిళ భాషా చిత్రంగా ఫిలిం ఫేర్ అవార్డ్ పొందడమే కాకుండా ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించబడింది.
1991 లో పక్కా కమర్షియల్ హీరోగా పేరు పొందిన బాలకృష్ణతో ప్రయోగాత్మకంగా సైంటిఫిక్ ఫిక్షన్ ‘ఆదిత్య369’ తీసి బాలకృష్ణ రెండు పాత్రల్లో ఎంతో వైవిధ్యాన్ని చూపించారు. (కృష్ణ కుమార్, శ్రీకృష్ణ దేవరాయలు ) ఈ సినిమా అప్పట్లో గొప్ప బాక్స్ ఆఫీస్ హిట్(1.4 మిలియన్ల US డాలర్ల కలెక్షన్). 1992 లో రాజేంద్ర ప్రసాద్ తో తీసిన ‘బృందావనం’ చిత్రానికి ఉత్తమ స్క్రీన్ప్లే కిగాను నంది అవార్డు అందుకున్నారు. 1993 లో రాజేంద్రప్రసాద్ ణు ఆడవేషలో చూపిస్తూ ‘మేడమ్’ అనే ప్రయోగాత్మక చిత్రం చేసారు.
1994 లో ఈయన తీసిన అద్భుత జానపద చిత్రం ‘భైరవ ద్వీపం’. ఈ చిత్రానికి గాను ఉత్తమ దర్శకుడుగా నంది ని అందుకున్నారు. ఈ సినిమాలో అత్యంత ప్రజాదరణ పొందిన ‘‘విరిసినదీ వసంతగానం…… ‘’ పాటను రచించి lyricist గా కూడా తనదైన ముద్ర వేసారు.
2003 లో ‘Son Of Alladin’ అనే ఆంగ్లచిత్రానికి దర్శకత్వం వహించారు. 2008 లో ‘ఘటోత్కచ్’ అనే అనిమేషన్ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే , సంగీతం, దర్శకత్వం అందించి 8 పదుల వయసులోకూడా నేటి యువ దర్శకులతో పోటీపడుతున్నారీ బహుముఖ ప్రజ్ఞాశాలి.
ఈయన సినిమారంగానికి ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇటీవల ఈయనకి జీవిత సాఫల్య పురస్కారం అందజేసింది . Happy Birth Day to Sri Singeetham Srinivasarao

1 Comment
Leave a Reply

— required *

— required *

Theme by Design-Destination, powered by Design-Destination.