శ్రీ రామ నవమి శుభాకాంక్షలు
April 15, 2016 | by admin
శ్రీ రామ నవమి శుభాకాంక్షలు.

రామః కమలపత్రాక్షః సర్వసత్వమనోహరః ! రూప దాక్షిన్యసంపన్నః ప్రసూతో జనకాత్మజే ! తేజసా దిత్యసంకాశః క్షమయా పృథివీసమః ! బృహస్పతిసమో బుద్ధ్యా యశసా వాసవోపమః !     శ్రీ రాముడు మానవాళికి మార్గదర్శకుడు. ఒక ఉత్తమ  మానవుడి లక్షణాలు ఎలా ఉండాలో ఆచరించి చూపించిన మహనీయుడు.   శ్రీరామనవమి , శ్రీరాముడి యొక్క  జన్మదిన వేడుక. విష్ణుమూర్తి యొక్క ఏడవ అవతారమే రామావతారం.  చైత్ర శుద్ధ నవమి, పునర్వసు నక్షత్ర కర్కాటక లగ్నమధ్యాన్న సమయ మందు రాముడు […]

రామః కమలపత్రాక్షః సర్వసత్వమనోహరః ! రూప దాక్షిన్యసంపన్నః ప్రసూతో జనకాత్మజే !
తేజసా దిత్యసంకాశః క్షమయా పృథివీసమః ! బృహస్పతిసమో బుద్ధ్యా యశసా వాసవోపమః !

 

  శ్రీ రాముడు మానవాళికి మార్గదర్శకుడు. ఒక ఉత్తమ  మానవుడి లక్షణాలు ఎలా ఉండాలో ఆచరించి చూపించిన మహనీయుడు.   శ్రీరామనవమి , శ్రీరాముడి యొక్క  జన్మదిన వేడుక. విష్ణుమూర్తి యొక్క ఏడవ అవతారమే రామావతారం.  చైత్ర శుద్ధ నవమి, పునర్వసు నక్షత్ర కర్కాటక లగ్నమధ్యాన్న సమయ మందు రాముడు జన్మించెను .   వసంత నవరాత్రులు ఆఖరి రోజు. ఈ తొమ్మిది రోజులు అంటే ఉగాది రోజు మొదలు కొని, శ్రీరామనవమి రోజు వరకు, ఉత్సవాలు, అర్చనలు, పూజలు, భజనలు, కీర్తనలు చేస్తారు. నవమి రోజున సీతారామ కళ్యాణం చేస్తారు. మరునాడు దశమి రోజున పట్టాభిషేకం చేస్తారు.  ఉత్తర భారతదేశంలో మిధిలా, అయోధ్య – తమిళనాడు లో రామేశ్వరం లో ఆంధ్రప్రదేశ్ లో భద్రాచలం లో చాల వైభవం గా ఉత్సవాలు జరుగుతాయి.  అయోధ్య లో లక్షలాది మంది పవిత్రమైన సరయు నదిలో స్నానం చేస్తారు, రధయాత్ర లో పాల్గొంటారు.

          రాముడి ఆలయం లేని ఊరంటూ భారతదేశంలో ఉండదు.  అన్ని ఆలయాలలోను పందిళ్ళు వేసి సీతారామకల్యాణం తప్పకుండా చేస్తారు.  చైత్రమాసం ఆరంభం ఇప్పుడిప్పుడే  ఎండలు ముదురుతూ ఉంటాయి, అందుకేనేమో సీతారామకల్యాణం లో తప్పకుండా మిరియాలు వేసిన పానకం అందరికి ఇస్తారు, పాయసం తప్పకుండా చేస్తారు. కళ్యాణం లోని తలంబ్రాలని పెళ్లి కాని పిల్లలు అక్షతలు గా వేసుకొంటే వెంటనే పెళ్లి కుదురుతుంది అని నమ్మకం. 

1,275 Comments