విశ్వాసం [కథ] - ఆదూరి.హైమవతి.
July 18, 2015 | by admin
విశ్వాసం [కథ] – ఆదూరి.హైమవతి.

విశ్వాసం [కథ]   – ఆదూరి.హైమవతి.    సోమేశ్వర పురంలో సోమయ్య , చలపయ్య అనే ఇద్దరు స్నేహితులుండేవారు.సోమయ్యకు ఆ ఊరి లోని సోమేశ్వరునిపై అఖండ మైన భక్తి ఉండేది .ప్రతి దినం ఆ ఆలయానికివెళ్ళి సోమేశ్వరుని అర్చించి నతర్వాతే నిత్యకృత్యాలు ఆరంభించేవాడు. చలపయ్యకు ఏదేవుని పూజిస్తే త్వరగా మేలు జరుగుతుందో అనే ఆతృతతో నిత్యం అన్ని ఆలయాలకూవెళ్ళేవాడు.                                   సోమయ్య “మిత్రమా!  ఒకే దేవుని పూజిస్తూ ఆనామాన్నే స్మరిస్తే మంచిది సుమా!ఒకే దేవునిపై నమ్మిక మంచిది.”అని చెప్తుండే వాడు. […]

విశ్వాసం [కథ] - ఆదూరి.హైమవతి.

విశ్వాసం [కథ] – ఆదూరి.హైమవతి.

విశ్వాసం [కథ]   – ఆదూరి.హైమవతి.   

సోమేశ్వర పురంలో సోమయ్య , చలపయ్య అనే ఇద్దరు స్నేహితులుండేవారు.సోమయ్యకు ఆ ఊరి లోని సోమేశ్వరునిపై అఖండ మైన భక్తి ఉండేది .ప్రతి దినం ఆ ఆలయానికివెళ్ళి సోమేశ్వరుని అర్చించి నతర్వాతే నిత్యకృత్యాలు ఆరంభించేవాడు. చలపయ్యకు ఏదేవుని పూజిస్తే త్వరగా మేలు జరుగుతుందో అనే ఆతృతతో నిత్యం అన్ని ఆలయాలకూవెళ్ళేవాడు.                                   సోమయ్య “మిత్రమా!  ఒకే దేవుని పూజిస్తూ ఆనామాన్నే స్మరిస్తే మంచిది సుమా!ఒకే దేవునిపై నమ్మిక మంచిది.”అని చెప్తుండే వాడు.

” సోమయ్యా! నీవు ఇంతకాలంగా సోమేశ్వరుని పూజిస్తున్నావ్ ? నీకేం మేలుజరిగిందోచెప్పు వింటాను “అన్నాడు చలపయ్య . సోమయ్య ” అలాకాదు మిత్రమా! మనకు ఏకీడూ జరక్క పోడమే మనకు జరిగే మేలు  అనినావిశ్వాసం.ఆతర్వాత నీ ఇష్టం.” అన్నాడు .ఇలా వారి మధ్య అప్పుడప్పుడూ వాగ్వివాదాలు జరుగుతుండేవి , ఐనా ఆవాదనలు వారు స్నేహానికి మాత్రం భంగం రాకుండ ఇద్దరూ జాగ్రత్తపడేవారు.

ఇలా  ఉండగా ఒకరోజున వారిరువురూ పక్క ఊరిలోని త్రిలింగేశ్వరస్మామివారి  రధోత్సవం చూడను వెళ్ళారు. సాయంకాలానికి బాగా మబ్బులు కమ్మాయి. రధోత్సవం పుర్తై వారు తిరుగుప్రయాణం సాగించారు , మార్గమధ్యంలో వారు ఒక నదిని దాటవలసి వచ్చింది. ఆనదికి పైవాలున వర్షం పడటంతో  నదికి వరద మొదలైంది, స్నేహితులిద్దరూ సగం నదిని దాటాక వరద ఉర్ధృతి పెరిగ డంతో , ఈతరాని వారిద్దరూ నదిని దాటిబయటపడటం ఎలాగా అనుకోసాగారు.                                                             చలపయ్య ” ఏం సోమయ్యా! నీ శివుడు తన గంగమ్మను వదలి మనకు చాలా ఉపకారం చేస్తున్నాడే! ఇదేనా భక్తునిపై ఆయన కరుణ? ఎన్నో ఏళ్ళుగా నీవు చేస్తున్న పూజల ఫలితం ఇదా? ఇలా నీళ్ళలో కొట్టుకుపోయి ప్రాణాలు వదల వలసిందేనా? ఏందేవు డయ్యా ఆయన?” అనసాగాడు.

సోమయ్య ” చలపయ్యా! దైవదూషణ తగదు.ఇదీ ఎందుకోమనమంచికే ఐఉంటుంది , దైవం సాయంచేసేవాడేకానీ ఆపద కలిగించే వాడుకాదు. నమ్ము.” ..

“ఏం నమ్మమంటావ్ ? చచ్చిపోయాక నీభక్తి ఏంచేసుకోను? నీతో రావడం నేచేసిన తప్పిదం , దానికి పణంగా నాప్రాణాలే పోయేలా ఉన్నాయ్. కనీసం నదిలోఈదుకు పోతున్న ఆచేపల మైనా కాకపోతిమి నీటివాలుకు ఈది బయట పడేందుకు.”                                ” ఏంటి  చలపయ్యా ! నీమాటలు! ఉత్తమమైన మానవజన్మ ఎత్తి తిరిగి జలచరంగా మారాలనుకుంటున్నావా?” అని సోమయ్య అంటుండగానే వారు ఒక సుడిగుండంలో ఇరుక్కుని ప్రాణాలువదలి, కర్మవశాన వారిరువురు చివరగా స్మరించిన చేపజన్మ ఎత్తారు.

ఐతే భగవత్భక్తి ఉండటం వలన వారికి పూర్వజన్మ వృత్తాంతం గుర్తుండి పోయింది. సోమయ్య చేపజన్మలోనూ తన సోమేశ్వ రుని స్మరిస్తూనేఉన్నాడు. చలపయ్య మాత్రం ” నీతో రావడం వలన నేను మరణించి ఈ చేపజన్మ ఎత్తాను. నీసోమేశ్వరుడేం చేశాడో చూడు” అనసాగాడు.

వారు నది నీటివాలుకు కొట్టుకుపోయి , ఒక సరస్సును చేరారు. ఇరువురూ వారివారి వాసనల ప్రభావంతో జీవితం సాగించారు.. వేసవిలో ఆసరస్సులో నీరు తగ్గిపోసాగింది. అపుడు చలపయ్య ” చూడుసోమా !ఈ సరస్సులో నీరూ ఇగిరిపోతున్నది. ,మనం తప్పక వలలోపడి ఏమానవుడికో ఆహారంమైపోతాం , నీ సోమేశ్వరుని మహిమ చూడు.కనీసం మనం మరోచోటికి ఈదుకుంటూ నైనావెళ్ళి ప్రాణాలుకాపాడుకుందాం. ” అనగా , సోమయ్య చేప ” చలపా! భగవంతుడు, నా సోమేశ్వరుడు తప్పక మనిద్దరినీ కాపాడుతాడు, మరో చోటికిపోయినంత మాత్రాన ప్రాణాలు కపాడుకోడం మనచేతుల్లో లేదు. శివుని ఆఙ్ఞలేనిదే చీమైనాకుట్టదు.” అని  శివనామం జపించడంలో మునిగిపోయాడు.కొద్దిరోజులు కాగానే చేపలుపట్టేబెస్తవారు వచ్చి వలవేయగా అన్ని చేపలతో పాటుగా సోమయ్య , చలపయ్య చేపలుకూడా వలలో పడ్డాయి. చలపయ్య ” చూశావా  సోమా! చివరకు బెస్త వలలో చిక్కాం ఏవంటశాలకోచేరి , ఉడకడం ఖాయం , నీశివమహిమ !” అనగా , సోమచేప ” నాశంకరుడు మనల్నికాపాడటం ఖాయం ” అని శివనామ జపించసాగింది. వలలో చేపలు తీసి రాజుగారి వంటశాలలో ఇచ్చి బెస్తవాడు వెళ్ళిపోగానే , రాజుగారి వంటవాడు వాటిని కడిగి .కోయను కట్టికై లోపలికి పోగా , ఇంతలో  పెద్ద వర్షం వచ్చి చేపలుంచిన బుట్ట పక్కకు దొర్లి వాననీటి ఉధృతానికి నీరుపారి పక్కనే ఉన్న కాలువద్వారా సోమ , చలప చేపలు నీటివాలుకు కొట్టుకుపోయి నదిలోకి వెళ్ళాయి.

“చూశావా! చలపా ! నాశివుడు ఎలాకాచాడో!భగవంతునిపై నమ్మకమే జీవులను కాపాడుతుందని తెల్సుకో ! ” అని సోమయ్య చేప  అంటుండగానే రెండూ తిరిగి సుడి గుండంలో చిక్కుకుని మరణించి మానవజన్మ ఎత్తారు .

విశ్వాసమే జీవితానికి శ్వాస, ఊత.


360 Comments
Leave a Reply

— required *

— required *

Theme by Design-Destination, powered by Design-Destination.