వాదనలు పెంచ వద్దు
June 19, 2015 | by admin
వాదనలు పెంచ వద్దు

చాలా  మందిని చూస్తుంటాము ,ఏదో ఒక విషయం లో వాదిస్తూ ఉంటారు ,ఆ వాదనలు అనవసరమైన  గొడవలకి కారణాలు  అవుతూ ఉంటాయి ,వాదనలు పెంచే కొద్ది పెరుగుతాయి . అవతలి వాళ్ళు చెప్పేది పూర్తిగా వినాలి . మనకు తోచిందే సరైనది అనుకుంటే కాదు . మీ కోపానికి కారణం అవతలి వాళ్ళు అయినపుడు ,ఆ వ్యక్తీ ఏ పరిస్థితుల్లో వాదనకు దిగాడో  ఆలోచించాలి ,   ఏ ఇద్దరి అభిప్రాయలు ఒకలా ఉండక పోవచ్చు .కాని మనం […]

చాలా  మందిని చూస్తుంటాము ,ఏదో ఒక విషయం లో వాదిస్తూ ఉంటారు ,ఆ వాదనలు అనవసరమైన  గొడవలకి కారణాలు  అవుతూ ఉంటాయి ,వాదనలు పెంచే కొద్ది పెరుగుతాయి . అవతలి వాళ్ళు చెప్పేది పూర్తిగా వినాలి . మనకు తోచిందే సరైనది అనుకుంటే కాదు . మీ కోపానికి కారణం అవతలి వాళ్ళు అయినపుడు ,ఆ వ్యక్తీ ఏ పరిస్థితుల్లో వాదనకు దిగాడో  ఆలోచించాలి ,

 
ఏ ఇద్దరి అభిప్రాయలు ఒకలా ఉండక పోవచ్చు .కాని మనం సమాజంలో ఎందరితోనో కలిసి మెలిసి ఉండవలసి వస్తుంది ,ఆఫీసులో పై అధికారితో తోటి ఉద్యోగులతో ఇంట్లో భర్తతో పక్కింటి వాళ్ళతో బంధువులతో ఇలా అందరితో కలిసి మెలిసి వుండాలి ..  ముఖ్యంగా జీవితాంతం కలిసి వుండేది భర్తతో కాబట్టి భార్య భర్తల మధ్య వచ్చే సమస్యలని పెద్దవి చేస్కోకుండా సర్దుకుపోవాలి 
 
వాదనలు పెంచే కొద్ది పెరుగుతాయి అవతలి వాళ్ళు చెప్పేది పూర్తిగా వినాలి ,మీకు తోచినది సరైనది అనుకుంటే కాదు ఆఫీసు నుంచి భర్త ఆలస్యంగా వచ్చాడని మీరు దెబ్బలాటకు   దిగొద్దు  ,అర్ధం చేస్కునే గుణం వున్నా భార్య దగ్గర ఏ భర్త అబద్దం  చెప్పడు అది నిజం . అలాగే భార్యల్ని కూడా అనవసర విషయాలకి చివాట్లు పెట్టకూడదు . భర్త మనసెరిగి భార్య ,భార్య మనసెరిగి భర్త నడుచుకుంటే ఏ గొడవలు వుండవు . 
కొందరికి ప్రతి విషయాన్నీ ప్రతికూలంగా ఆలోచించటం అలవాటు ఎదుటి వాళ్ళు  చెప్పిన ప్రతిది అయిష్టం గానే తోస్తుంది,అప్పుడే వాదనలు మొదలుతాయి ఆఫీసులో పై అధికారుల అహం భరించటం చాలామంది ఆడవాళ్ళకి కష్టంగా వుంటుంది ,అయినా మన తెలివితేటలతో అలాంటి  వాళ్ళని ఎదుర్కొన వచ్చు  ,నేర్పరితనం లౌక్యమ్ వుంటే చాలు ఎలాంటి వాళ్లతో నైనా సర్దుకు పోవచ్చు.  
పిల్లల విషయం లో చాల మంది తల్లితండ్రులు వాదించుకుంటూ వుంటారు అది తప్పు ,పని పిల్లల ముందు అత్తమామల  ముందు ఇరుగుపొరుగు ముందు వాదించు కోకూడదు ,ఒక వేళ  ఈ విషయంలో నైన అభిప్రేయభేదాలు వస్తే ఒకరికొకరు నచ్చి చెప్పుకునే  సామర్ధ్యం వుండాలి 
పిల్లలకి తల్లితండ్రులు ఆదర్శంగా వుండాలి ,కానీ సమస్యలా వుండకూడదు సహనంతో ,లౌక్యమ్ తో వుంటే వాదనలు పెరగ కుండ ఉండటమే కాకా ,సమస్యని విజ్ఞతతో చుస్తే మంచి పరిష్కారం దొరక్క పోదు . 
 
 
పాలపర్తి సంద్యారాణి 
1,159 Comments