friend ship day
August 1, 2015 | by admin
మైత్రి దినోత్సవం ప్రత్యేకం [friend ship day ]

మైత్రి దినోత్సవం ప్రత్యేకం [friend ship day ]  మనకేదన్నా కష్టం వస్తే బంధువుల కన్నా ముందుగా  గుర్తు వచ్చేవారు స్నేహితులే .రామాయణం లో సుగ్రీవుడి,శ్రీరాముని మైత్రి ,భారతం లో దుర్యోధనుడు ,కర్ణుని మైత్రి చాల గొప్పది . స్నేహానికి ఆస్తులు అంతస్తులు బేదము వుండదు అనే విషయము  మనకి శ్రీ కృష్ణుడు,కుచేలుడు కథలో తెలుస్తుంది .    శ్రీ కృష్ణుడు,కుచేలుడు సాందీపని వద్ద విద్యాభ్యాసము చేస్తారు. కుచేలుడు శ్రీ కృష్ణునికి అత్యంత ప్రియమైన స్నేహితుడు.విధ్యబ్యాసము పూర్తి చేసిన తరువాత ,కుచేలుడు తన గ్రామమ చేరి వివాహం […]

మైత్రి దినోత్సవం ప్రత్యేకం [friend ship day ] 

మనకేదన్నా కష్టం వస్తే బంధువుల కన్నా ముందుగా  గుర్తు వచ్చేవారు స్నేహితులే .రామాయణం లో సుగ్రీవుడి,శ్రీరాముని మైత్రి ,భారతం లో దుర్యోధనుడు ,కర్ణుని మైత్రి చాల గొప్పది . స్నేహానికి ఆస్తులు అంతస్తులు బేదము వుండదు అనే విషయము  మనకి శ్రీ కృష్ణుడు,కుచేలుడు కథలో తెలుస్తుంది .    శ్రీ కృష్ణుడు,కుచేలుడు సాందీపని వద్ద విద్యాభ్యాసము చేస్తారు. కుచేలుడు శ్రీ కృష్ణునికి అత్యంత ప్రియమైన స్నేహితుడు.విధ్యబ్యాసము పూర్తి చేసిన తరువాత ,కుచేలుడు తన గ్రామమ చేరి వివాహం చేసుకుంటాడు,అదిక సంతానం తో కటిక  దారిద్ర్యాన్ని అనుభవిస్తూ  ఉంటాడు.కుచేలుడి బార్య “శ్రీ కృష్ణుడు మీ మిత్రుడే కదా ఏదన్నా సాయం “అడగమని శ్రీ కృష్ణుడు వద్దకు పంపిస్తుంది. పంపేటప్పుడు కొన్ని అటుకులు మూట కట్టిస్తుంది. తనని శ్రీ కృష్ణుడు గుర్తు పెట్టుకుని ఆడరిస్తాడా  ?అనే అనుమానం తో ద్వారక లో అడుగు పెడతాడు .కాని కుచేలుని అనుమానాన్ని పటా పంచలు  చేస్తూ శ్రీ కృష్ణుడు కుచేలుడిని స్వయంగా రాజ సభలోకి ఆహ్వానించి ఉచితాసనం ఇచ్చి కాళ్ళు కడిగి ఆ నీళ్ళు తన శిరస్సు పై చల్లుకొంటాడు. ఆ విధంగా ఉపచారాలు అందుకొంటున్న కుచేలుడిని చూసిన సభలో ఉన్నవారు కుచేలుడి అదృష్టాన్ని కొనియాడుతారు. ఇద్దరు బాల్యం లోని ముచ్చట్లు చెప్పుకుంటారు .కుచేలుడు తెచ్చిన అటుకులు తిని మిత్రుడికి సిరిసంపదలు ప్రసాదిస్తాడు కృష్ణ భగవానులు .స్నేహం కలకాలం ఎటువంటి అరమరికలు లేకుండా సాగాలంటే ఒకరి ఫై ఒకరికి నమ్మకం వుండాలి .అవసరం కోసం స్నేహం చెయ్యకూడదు . అటువంటి స్నేహాలు ఎక్కువ కాలం నిలవవు. అందుకే” a friend in need is a friend indeed”అన్నారు .   

315 Comments
Leave a Reply

— required *

— required *

Theme by Design-Destination, powered by Design-Destination.