April 21, 2017 | by admin
“మా అమ్మ” – రచన: రవీంద్రనాథ్ ఠాగూరు ( తెలుగు సేత: వర్చస్వి )

  //మా అమ్మ// రచన: రవీంద్రనాథ్ ఠాగూరు  //  తెలుగు సేత: వర్చస్వి నే ఆడుకునే బొమ్మల మధ్య అల్లిబిల్లి ఊయల పాటలు మధురగానాలు అవుతుంటే ఓ పాటగా అమ్మే గుర్తుకొస్తుంది ! ఓ శారద ఉదయపు లేలేతగాలిలో మొలిచిన ‘ షూలీ’ పూల పరిమళం గుళ్ళోని సుప్రభాత సేవల సౌరభంగా వీస్తుంటే ఓ సురభిళంగా అమ్మే గుర్తుకొస్తుంది ! ౩. పడగ్గది కిటికీలోంచి నా చూపులశరాలు వినీలాకాశంలోకి విసిరేసుకున్నాక అక్కడ తదేకంగా నన్నే చూస్తున్న దృశ్యం […]

 

//మా అమ్మ// రచన: రవీంద్రనాథ్ ఠాగూరు  //  తెలుగు సేత: వర్చస్వి

 1. నే ఆడుకునే బొమ్మల మధ్య
  అల్లిబిల్లి ఊయల పాటలు
  మధురగానాలు అవుతుంటే
  ఓ పాటగా అమ్మే గుర్తుకొస్తుంది !
 2. ఓ శారద ఉదయపు లేలేతగాలిలో
  మొలిచిన ‘ షూలీ’ పూల పరిమళం
  గుళ్ళోని సుప్రభాత సేవల సౌరభంగా వీస్తుంటే
  ఓ సురభిళంగా అమ్మే గుర్తుకొస్తుంది !

౩. పడగ్గది కిటికీలోంచి నా చూపులశరాలు
వినీలాకాశంలోకి విసిరేసుకున్నాక అక్కడ
తదేకంగా నన్నే చూస్తున్న దృశ్యం పరుచుకున్నప్పుడు
ఓ లీలగా అమ్మే గుర్తుకొస్తుంది!

 

1,050 Comments