మందారమాల
August 8, 2015 | by admin
మందారమాల [కథ]–తిరుమలశ్రీ

మందారమాల [కథ]–తిరుమలశ్రీ పున్నమి వెన్నెల తెల్లగా చల్లగా పుడమిని అలరిస్తోంది. తారకలతో సయ్యాటలాడుతున్నాడు నెలరేడు. చల్లటి గాలులు వింజామరలు వీస్తున్నాయి. అంతఃపురం వెనుకనున్న సుందర ఉద్యానవనమది. పూదీవెలతో, పరిమళ పుష్పాలతో చుట్టియున్న చలువరాతి మండపం వెన్నెల్లో తెల్లగా మెరుస్తోంది.  లోపల చంద్రశిలా తల్పంపైన ఒకరి యొడిలో నొకరు మైమరచి యున్నారు మహారాజు శ్రుతకీర్తి, అతని చిన్న రాణి మందారమాలాను. శీతల పవనాలు శరీరాలకు చందన లేపనం పూస్తూంటే, పుష్పసౌరభాలు మనసులకు మత్తెక్కిస్తూంటే, మన్మథబాణాలు హృదయాలకు గిలిగింతలు పెడుతూంటే…పరిసరాలను […]

మందారమాల

మందారమాల

మందారమాల [కథ]–తిరుమలశ్రీ

పున్నమి వెన్నెల తెల్లగా చల్లగా పుడమిని అలరిస్తోంది. తారకలతో సయ్యాటలాడుతున్నాడు నెలరేడు. చల్లటి గాలులు వింజామరలు వీస్తున్నాయి.

అంతఃపురం వెనుకనున్న సుందర ఉద్యానవనమది. పూదీవెలతో, పరిమళ పుష్పాలతో చుట్టియున్న చలువరాతి మండపం వెన్నెల్లో తెల్లగా మెరుస్తోంది.  లోపల చంద్రశిలా తల్పంపైన ఒకరి యొడిలో నొకరు మైమరచి యున్నారు మహారాజు శ్రుతకీర్తి, అతని చిన్న రాణి మందారమాలాను. శీతల పవనాలు శరీరాలకు చందన లేపనం పూస్తూంటే, పుష్పసౌరభాలు మనసులకు మత్తెక్కిస్తూంటే, మన్మథబాణాలు హృదయాలకు గిలిగింతలు పెడుతూంటే…పరిసరాలను విస్మరించి, ఒకరి కన్నులలోకి ఒకరు వీక్షించుకుంటూ పరవశం చెందుతున్నారు ఆ రాజ దంపతులు.

నెచ్చెలి వంక కన్నార్పకుండా చూసాడు శ్రుతకీర్తి… మంచిగంధం, పసిడి, పాలమీగడ, గులాబి రేకులూ రంగరించి పూసినట్లున్న తళుకులీనే నున్నటి మేని చాయ. చంద్రబింబంలాంటి వదనం. ఊసులు చెప్పే కమలాల కన్నులు. పొందికైన నాసిక. మధువులూరించే అధరాలు. శంఖాన్ని పోలిన కంఠం. కవ్వించే కుచద్వయం. పిడికిట ఇమిడే నడుము. తామరతూళ్ళవంటి చేతులు. పొడవుగా ఉండే నాజూకు రూపం. అణువణువునా లావణ్యం ఉట్టిపడుతూంటే – రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమలు అందరినుండీ తలో అంశనూ పుణికిపుచ్చుకున్నట్టున్న అద్వితీయ సౌందర్యం ఆమెది… ఓ పట్టాన ఆమెపైనుండి చూపులు మరల్చుకోలేకపోయాడు.

విభుని చూపులు మనసుకు, శరీరానికీ గిలిగింతలు పెడుతూంటే అలవోకగా చూసింది మందారమాల. “చూపుల తూపులతో చెలి దేహానికి తూట్లుపెట్టడం భావ్యమా సఖా?” అంది కించిత్తు నిష్టూరతను స్వరంలో ధ్వనింపజేస్తూ.

శ్రుతకీర్తి పెదవులపైన మందహాసరేఖ మెరసింది. “దివిజాంగనలకే స్వంతమైన ఈ అపూర్వ సౌందర్యం నా స్వంతమంటే…మాకింకా విశ్వాసం కలగడంలేదు సుమా!” అన్నాడు, తళుకులీనే చెలి చెక్కిళ్ళపైన అధరాలతోరాస్తూ.                                                                                                                           అతని చర్యతో ఆమె చెక్కిళ్ళు కెంపులయ్యాయి. వదనం రాగరంజితమైంది.

వనంలోని పికము కూయడంతో, వృక్షశాఖపైన కునికిపాట్లు పడుతూన్న శుకము ఉలికిపడి కనులు తెరచింది. ఆ దంపతుల ఉనికిని అప్పుడే గుర్తించినదానిలా, ’మందారమాల…అందాలబాల…’ అంటూ ముద్దుగా పలికింది. బదులుగా కోయిల గళమెత్తి వీనులవిందుగా పాడుతూంటే, మిగతా పక్షిజాతులు తమదైన శైలిలో అనుసరించాయి.  వృక్షరాజములు లయగా తలలూపాయి.

“విన్నావా, సఖీ! పక్షులు సైతం నీ అందాన్ని శ్లాఘిస్తూంటే, ప్రకృతి నీకు నీరాజనాలర్పిస్తోంది…” అంటూ ఆర్తిగా ఆమె అధరాలను అందుకున్నాడు అతను.

సిగ్గుతో మొగ్గలా ముడుచుకుపోయిన చెలిని అతను ఆక్రమించుకుంటూంటే…కాలం స్థంభించిపోయింది.


ఆరు నెలల క్రితపు మాట —

విశృంఖల దేశానికి నూరు క్రోసుల దూరంలో ఓ తపోవనం ఉంది. మునులు అందులో ఆశ్రమాలు నిర్మించుకుని తపస్సు చేసుకునేవారు. వారిలో వయోవృద్ధుడైన సత్యమేథ మహర్షి ముఖ్యుడు.

ఆ తపోవనానికి జ్వాలాకారుడనే ఓ రాక్షసుడి బెడద ఎక్కువగా ఉండేది. మునుల తపస్సులకు భంగం కలిగించడం, పర్ణకుటీరాలను ధ్వంసం చేయడం, మునికన్యలను బలాత్కరించడం చేసేవాడు. మునీశ్వరుల కోరికపైన ఆ రాక్షసుణ్ణి సంహరించేందుకు తన సైన్యాన్ని పంపించాడు మహారాజు శ్రుతకీర్తి. ఆ రాక్షసుణ్ణి లొంగదీయడం సైన్యాలకు సాధ్యంకాలేదు.

ఓసారి సత్యమేథుడు లోకకళ్యాణార్థం యాగం ఒకటి తలపెట్టాడు. మూడు రోజులపాటు సాగే ఆ యజ్ఞాన్ని జ్వాలాకారుడు నాశనం చేయకుండా రక్షణ కల్పించవలసిందిగా రాజుని కోరాడు.

ఈసారి శ్రుతకీర్తే స్వయంగా జ్వాలాకారుణ్ణి ఎదుర్కొనడానికి పూనుకున్నాడు.

యాగాన్ని ధ్వంసం చేయాలని ఎన్నో విధాలుగా ప్రయత్నించాడు జ్వాలాకారుడు.  చివరికి శ్రుతకీర్తి చేతిలో హతమయ్యాడు.  యాగం నిరాటంకంగా కొనసాగింది. జ్వాలాకారుడి పీడ విరగడైనందుకు సంతసించిన మునిజనం పండుగ చేసుకున్నారు.

సత్యమేథుడు కృతజ్ఞతాపూర్వకంగా తపోబలంతో ఖడ్గం ఒకటి సృష్టించి ఓ మునికన్యక చేతుల మీదుగా మహారాజుకు బహూకరించబోయాడు.

ఐతే శృతకీర్తి ఖడ్గాన్ని అందుకోలేదు.  అతని చూపులు పదునారేండ్ల ఆ మునికన్యకపైనే స్థిరంగా నిలచిపోయాయి.

“మునీంద్రా! మాకు ఖడ్గం వద్దు. అద్వితీయ సౌందర్యవతియైన ఈ కన్యకామణి కావాలి!” అన్నాడు.

ఎదురుచూడని ఆ కోర్కెకు తెల్లబోయిన సత్యమేథుడు, “ఇది సామాన్య ఖడ్గం కాదు, రాజా! ఇది నీవద్ద ఉన్నంతవరకు నీకు అపజయమంటూ ఉండదు” అన్నాడు.

“జయాపజయాలు ఖడ్గంలో ఉండవు, మునీంద్రా! మా భుజబలంలో, శౌర్యంలో ఉంటాయి. మీకు అభ్యంతరం లేకపోతే ఈ సుందరాంగిని మేము మా అర్థాంగిని చేసుకోదలచాము”.

“రాజా! వలచిన వనితను కోరుకోవడము, బహుభార్యాత్వము క్షాత్రధర్మమే ఐనా… బాహ్యసౌందర్యానికి వశమై, విజయ ఖడ్గాన్ని వదులుకోవడం ఎంతవరకు సముచితమో యోచించు” అన్నాడు సత్యమేథుడు శాంతంగా.

“మన్నించండి. స్వశక్తిని నమ్ముకున్న మాకు మంత్రఖడ్గంతో పనిలేదు,” దృఢంగా పలికాడు శృతకీర్తి.

ఏడాది క్రితం  ఓ ఆపదలో చిక్కుకున్న ఆ బాలికను కాపాడి, ఆమెకు తమ ఆశ్రమంలో ఆశ్రయం ఇచ్చారు మునీశ్వరులు. ఇప్పుడు రాజే ఆమెను కోరుకుంటుంటే అడ్డుచెప్పడానికి కారణం కనిపించలేదు సత్యమేథుడికి, ఒక్క వయోభేదం తప్ప. ఆ బాలిక – మందారమాల – కూడా అభ్యంతరం చెప్పలేదు. ఆ మునీశ్వరుల సాక్షిగా ఆమెను వివాహమాడి తనతో రాజధానికి తీసుకుపోయాడు మహారాజు.


శృతకీర్తి యాభయ్యో పడిలో ఉన్నాడు. అనుకూలవతి ఐన భార్య పట్టపురాణి వసుధాదేవి ఉన్నా, మునికన్య మందారమాల అందానికి సమ్మోహితుడై ఆమెను ద్వితీయ కళత్రంగా స్వీకరించి తీసుకువచ్చాడు. రాణివాసంలో ఓ ప్రత్యేక మందిరంలో ఉంచాడు. ఆమె సౌందర్యం మధువులా పనిచేయడంతో రేయింబవళ్ళు ఆమెతోటిదే లోకమైపోయింది అతనికి.

ఓసారి ఉద్యానవనంలో ఒంటరిగా వాహ్యాళి కరగిన మందారమాలకు అనుకోకుండా ఓ యువకుడు తారసపడ్డాడు…      ఇరవదిరెండేళ్ళు ఉంటాయి అతనికి. చక్కటి రూపురేఖలు, స్ఫురద్రూపంతో…అతివలను ఆకర్షించుకునే శరీర సౌష్ఠవంతో…ఆమెను ఇట్టే ఆకట్టుకున్నాడు.

ఆ యువకుడి పేరు ఆదిత్యుడు. పట్టపురాణి వసుధాదేవికి బంధువు. అవివాహితుడు. రాజుగారి కొలువులోనే హోదా గల ఉద్యోగం చేస్తున్నాడు.

ఆదిత్యుడు, మందారమాల అద్వితీయ సౌందర్యం గురించి ఆలకించియున్నాడు.  కనులారా గాంచడం అదే మొదటిసారి. తనకు తెలియకుండానే తొలిచూపులోనే ఆమె పైన మనసు పారేసుకున్నాడు. ఆమె రాజుగారి అనుంగు పత్ని అన్న విషయం ఆ క్షణంలో జ్ఞప్తికి రాలేదు అతనికి.

మందారమాల కూడా అతనిపట్ల ఆకర్షితురాలు కావడంతో – ఒకరి కనులలోకి ఒకరు ప్రేమతో, ఆరాధనతో వీక్షించుకుంటూ ఉండిపోయారు.

బాహ్య ప్రపంచాన్ని విస్మరించి వారు అలా ఎంతసేపు ఉండిపోయారో తెలియదు, చెలికత్తెలు వచ్చి హెచ్చరించాక గాని తెలివిలోకి రాలేదు. తడబాటుతో అక్కడనుండి తప్పుకున్నారు ఇరువురూ.

అందం, యవ్వనం సమఉజ్జీనే కోరుకుంటాయి కాబోలు! నీరు పల్లమెరుగునన్నట్టు, మందారమాల యవ్వనం ఆదిత్యుడి వైపు మొగ్గుచూపింది. తన తలపులను గుత్తకు తీసుకున్న అతని కౌగిలి కోసం ఆరాటపడిపోయాయి ఆమె మనమూ, తనువూను…

అక్కడ ఆదిత్యుడి స్థితీ అలాగే ఉంది. కనులు మూసినా తెరచినా మందారమాల రమణీయ రూపమే ప్రత్యక్షమౌతూ అతని మదికి నెమ్మది లేకుండా చేస్తోంది.  ఆమె అందని జాబిలి అన్న ఊహే అతన్ని కృంగదీయసాగింది.

అనూహ్యంగా ఓ రోజున మందారమాల నుండి ఆహ్వానం రావడంతో ఆనందంతో ఉక్కిరిబిక్కిరయిపోయాడు ఆదిత్యుడు. ఆమె పంపించిన ఆంతరంగిక చెలికత్తెతో రహస్యంగా చిన్నరాణి మందిరంలో ప్రవేశించాడు.

బిరాన ఎదురు వెళ్ళి ఆర్తితో ఆదిత్యుణ్ణి ఆలింగనం చేసుకుంది మందారమాల. ఆమెను తన బిగి కౌగిలిలో బిగించాడు అతను,

అది ఆరంభం మాత్రమే. ఆ తరువాత నిత్యమూ ఏదో ఒక వేళలో రహస్యంగా కలుసుకుంటూనే ఉన్నారు వాళ్ళు.

కోరిన పడతినల్లా భార్యను చేసుకోవడం ఆ రాచరికపు ఆచారంలో తప్పుకానప్పుడు – వయసు మళ్ళిన భర్తతో కాపురం చేసే పదిహేడేళ్ళ యువతి తన యవ్వన సౌందర్యాలకు నిర్వచనం చెప్పే తగిన జోడును వెదుక్కోవడంలో తప్పులేదనిపించింది ఆమెకు. తాను ఎరిగిన ఆశ్రమ ధర్మానికది విరుద్ధమే ఐనా, వేధిస్తూన్న మన్మథ తాపం తనకు శాపం కారాదని, ఆ తప్పుకు ఒడంబడింది…


రంకు, బొంకు ఎక్కువ కాలం దాగవంటారు! తన ముద్దుల రాణి మందారమాల ఆమధ్య ఎవరో యువకుడితో చనువుగా ఉంటోందన్న వార్త ఎలాగో మహారాజు శ్రుతకీర్తి చెవికి ప్రాకింది. మందారమాల శీలాన్ని శంకించడానికి అతనికి మనసు ఒప్పలేదు. కొద్ది రోజులపాటు రహస్యంగా ఆమెను గమనించాడు.

ఆమె ప్రేమలో కాని, ప్రవర్తనలో కాని ఎటువంటి లోపమూ గోచరించలేదు. నిజం రుజువు కానిదే తొందరపడకూడదని నిశ్చయించుకున్నాడు. ఆ పుకార్లు వట్టివో, గట్టివో స్వయంగా తేల్చుకోవాలనుకున్నాడు.

ఓ రోజున ఏదో రాచకార్యం పైన నాలుగు రోజులపాటు రాజధానిని విడిచి వెళ్తున్నట్టు మందారమాలతో చెప్పాడు శ్రుతకీర్తి. ఆ నాలుగు రోజులూ తాను ఆమె ఎడబాటును సహించక తప్పదన్నాడు.

అతని పొందు లేని రేయి తనకూ దుర్భరమే నంటూ, అతను తిరిగి వచ్చేవరకు క్షణమొక యుగంలా నిట్టూర్పులతో గడిపివేస్తానంటూ వగలుపోయింది ఆమె.

శ్రుతకీర్తి వెళ్ళి రెండు రోజులు అయింది. భర్త ఊళ్ళో లేడన్న ఉత్సాహంతో నిర్భీతితో పగలు, రేయి కానకుండా ప్రియుడితోటిదే లోకంలా గడపింది మందారమాల

.       మూడో రోజు రాత్రి –

చిన్నరాణి గారి మందిరానికి ముందుగా కబురుపెట్టకుండా హఠాత్తుగా వేంచేసిన మహారాజును గాంచి అదిరిపడ్డారు మందారమాల చెలికత్తెలు. కలవరపాటుతో మాట పడిపోయింది వారికి. శిలాప్రతిమలే అయ్యారు.

ఆ సమయంలో ఆదిత్యుడు చిన్నరాణి గారి శయన మందిరంలోనే ఉన్నాడు. అతగాడు, మందారమాల ప్రేమ మైకంలో మునిగి, వలపుల కొలనులో ఈతలు కొడుతున్నారు.

యజమానురాలిని హెచ్చరించే మార్గం కాని, సమయం కాని లేక…మందారమాల చెలులు మహారాజును ఎలాగో మభ్యపెట్టి జాప్యం చేయాలని ప్రయత్నించారు కాని, వారి ఆశ ఫలించలేదు. శ్రుతకీర్తి యొక్క తీక్ష్ణపు దృక్కులకు గజగజ వణికిపోతూ పక్కకు తొలగేరు.

ఆంతరంగిక మందిరంలో నిశ్శబ్దంగా ప్రవేశించిన శ్రుతకీర్తి, హంసతూలికా తల్పానికి ఉన్న పట్టుతెరలను తొలగించాడు.

ఎదురుగా –

ఆ జంటను చూడగానే ఆవేశంతో ఊగిపోయాడు మహారాజు.

“మందారమాలా…!” కోపోద్యుక్తుడైన అతని కంఠం అంతఃపురంలో ప్రతిధ్వనించింది.

నెత్తిన పిడుగు పడ్డట్టు త్రుళ్ళిపడి విడిపోయింది ఆ ప్రేమజంట.

హఠాత్తుగా కట్టెదుట మహారాజును చూడడంతో భయవిహ్వలులై పెనుగాలి తాకిన ఆకుల్లా గజ గజ లాడిపోయారు మందారమాల, ఆదిత్యుడూను.

.

“వంచకీ! ఆశ్రమవాసినివి…అందలం ఎక్కిస్తే…నాకే ద్రోహం  చేస్తావా! శిరచ్ఛేదమే నీకు తగిన శిక్ష…”  శ్రుతకీర్తి కుడిచేయి మొలనున్న కైజారును తాకింది…

***                                                                      మర్నాటి ఉదయం –

రాజోద్యానవనం వెలుపల నున్న సరస్సులో… కత్తిపోట్లతో పడియున్న మహారాజు శ్రుతకీర్తి మృతదేహం రాజ్యంలో గొప్ప సంచలనం రేపింది…!?

37 Comments
 • Yes! Finally something about How long does Achilles tendonitis last for?.

 • I do agree with all the concepts you have offered to your post. They’re very convincing and will definitely work. Nonetheless, the posts are too short for starters. Could you please extend them a bit from subsequent time? Thanks for the post.

 • I simply want to mention I’m new to blogging and site-building and certainly savored this blog site. Very likely I’m want to bookmark your website . You amazingly have awesome articles. Thank you for sharing your blog site.

 • Excellent post. I was checking continuously this blog and I am impressed! Very helpful information specifically the last part 🙂 I care for such information much. I was seeking this certain info for a very long time. Thank you and best of luck.

 • Simply wanna input that you have a very nice website , I enjoy the pattern it really stands out.

 • I’m still learning from you, while I’m making my way to the top as well. I definitely enjoy reading all that is posted on your website.Keep the information coming. I liked it!

 • Hello, you used to write wonderful, but the last several posts have been kinda boring¡K I miss your tremendous writings. Past several posts are just a little bit out of track! come on!

 • Quite interesting. I think you made precious and legitimate points in this writing. I agree with you one hundred percent and am pleased I had the chance to see this.

 • I precisely wished to say thanks again. I am not sure the things I would’ve used without the techniques contributed by you concerning this subject. It has been a depressing condition in my circumstances, nevertheless being able to view the very well-written way you resolved that made me to jump with happiness. Now i am thankful for this information and thus expect you really know what an amazing job that you are carrying out educating the rest using your site. I am sure you have never met any of us.

 • Hi there! Someone in the Twitter group mentioned this site here so that I came to take a look. I most certainly love this article. I am bookmarking and will also be tweeting this to my followers! Useful blog and outstanding layout.

 • Heya i am for the first time here. I found this board and I find It truly useful & it helped me out a lot. I hope to give something back and help others like you aided me.

 • Well I truly enjoyed studying it. This subject offered by you is very helpful for accurate planning.

 • My husband and i got quite delighted that Albert could conclude his survey out of the precious recommendations he gained while using the weblog. It’s not at all simplistic to just continually be handing out tricks which often others may have been making money from. And we all recognize we need you to be grateful to for this. The type of illustrations you have made, the straightforward site menu, the friendships you will help create – it is most amazing, and it’s aiding our son in addition to our family believe that this idea is exciting, and that’s especially serious. Many thanks for the whole lot!

 • Great remarkable issues here. I am very happy to look your article. Thank you a lot and i am looking ahead to touch you. Will you please drop me a mail?

 • wonderful issues altogether, you simply gained a brand new reader. What may you suggest in regards to your publish that you just made some days ago? Any sure?

 • Hi there very nice site!! Man .. Excellent .. Wonderful .. I will bookmark your web site and take the feeds additionally…I’m satisfied to find numerous useful info here in the post, we need develop more techniques on this regard, thank you for sharing.

 • Whats Taking place i am new to this, I stumbled upon this I have discovered It absolutely helpful and it has helped me out loads. I hope to give a contribution & aid other users like its aided me. Great job.

 • I have read several good stuff here. Certainly value bookmarking for revisiting. I wonder how so much attempt you put to create any such wonderful informative site.

 • I dugg some of you post as I thought they were very useful handy

 • I truly wanted to jot down a simple remark to appreciate you for those stunning techniques you are giving on this website. My considerable internet lookup has now been honored with reasonable tips to go over with my family. I would say that we readers are extremely blessed to dwell in a really good site with very many perfect professionals with good techniques. I feel extremely privileged to have seen the web page and look forward to some more entertaining times reading here. Thanks once again for a lot of things.

 • Thank you, I have recently been looking for info approximately this subject for a long time and yours is the greatest I’ve came upon till now. However, what about the conclusion? Are you certain in regards to the supply?

 • I got what you mean , appreciate it for putting up.Woh I am lucky to find this website through google. “Since the Exodus, freedom has always spoken with a Hebrew accent.” by Heinrich Heine.

 • Thanks a lot for sharing this with all people you really recognise what you are talking about! Bookmarked. Kindly additionally seek advice from my web site =). We will have a link exchange agreement among us!

 • naturally like your web site however you need to check the spelling on several of your posts. A number of them are rife with spelling problems and I in finding it very troublesome to tell the reality on the other hand I’ll surely come again again.

 • Nice read, I just passed this onto a friend who was doing a little research on that. And he actually bought me lunch because I found it for him smile So let me rephrase that: Thanks for lunch!

 • I truly appreciate this post. I¡¦ve been looking all over for this! Thank goodness I found it on Bing. You’ve made my day! Thank you again

 • Magnificent site. A lot of helpful information here. I am sending it to several buddies ans also sharing in delicious. And naturally, thank you on your sweat!

 • Pretty nice post. I just stumbled upon your weblog and wanted to say that I’ve really enjoyed browsing your blog posts. After all I’ll be subscribing to your rss feed and I hope you write again very soon!

 • hello!,I really like your writing very so much! share we keep in touch extra about your article on AOL? I require a specialist in this house to unravel my problem. Maybe that’s you! Taking a look ahead to peer you.

 • It is in point of fact a great and useful piece of info. I am satisfied that you just shared this useful info with us. Please stay us informed like this. Thanks for sharing.

 • What i do not understood is in reality how you’re not really much more neatly-appreciated than you may be now. You are very intelligent. You understand thus considerably in the case of this subject, produced me for my part believe it from a lot of numerous angles. Its like men and women are not involved except it is one thing to accomplish with Lady gaga! Your own stuffs outstanding. At all times maintain it up!

 • I think this is one of the most vital info for me. And i am glad reading your article. But should remark on few general things, The site style is great, the articles is really great : D. Good job, cheers

 • Very interesting info!Perfect just what I was searching for!

 • I like this web site so much, saved to favorites. “American soldiers must be turned into lambs and eating them is tolerated.” by Muammar Qaddafi.

 • I’ve been absent for some time, but now I remember why I used to love this site. Thank you, I¡¦ll try and check back more often. How frequently you update your site?

 • I have been exploring for a little for any high quality articles or weblog posts in this kind of area . Exploring in Yahoo I at last stumbled upon this web site. Reading this info So i¡¦m satisfied to show that I’ve a very just right uncanny feeling I discovered exactly what I needed. I such a lot indubitably will make sure to don¡¦t put out of your mind this web site and give it a glance regularly.

 • I and my guys happened to be examining the good techniques on your web site while then I had an awful suspicion I had not thanked the blog owner for them. Most of the boys came certainly joyful to learn all of them and have in effect absolutely been taking advantage of these things. I appreciate you for really being so considerate as well as for choosing varieties of brilliant resources millions of individuals are really needing to be aware of. My personal honest apologies for not expressing gratitude to sooner.

Leave a Reply

— required *

— required *

Theme by Design-Destination, powered by Design-Destination.