నేరేడు పండ్లు
June 13, 2015 | by admin
నేరేడు పండ్లు

నేరేడు పండ్లు  వర్షాకాలం వచ్చేసింది. ఎక్కడ చూసినా నల్లగా నిగనిగలాడుతూ నేరేడు పండ్లు కనబడుతుంటాయి. కొంచెం తీపి, కొంచెం వగరుగా ఉండే నేరేడులో ఔషధ విలువలు అపారంగా ఉంటాయి. పండ్లేకాకుండా నేరేడు ఆకులు, గింజలు, ఆఖ రుకు బెరడు కూడ ఆరోగ్యానికి రక్ష కల్పించేవే. నేరేడును ఆయుర్వేదంలో అపర సంజీవనిగా పేర్కొన్నారు.  చాలామంది డయాబెటిస్‌ వ్యాధికి నేరేడు మహత్తరమైన మందులా భావి స్తారు. అయినా నేరేడులో విశేషమైన ఆమ్లాలు ఉంటాయి. అందులో ఆక్సాలిక్‌ ఆమ్లం, మాలిక్‌ ఆ మ్లం […]

నేరేడు పండ్లు 

వర్షాకాలం వచ్చేసింది. ఎక్కడ చూసినా నల్లగా నిగనిగలాడుతూ నేరేడు పండ్లు కనబడుతుంటాయి. కొంచెం తీపి, కొంచెం వగరుగా ఉండే నేరేడులో ఔషధ విలువలు అపారంగా ఉంటాయి. పండ్లేకాకుండా నేరేడు ఆకులు, గింజలు, ఆఖ రుకు బెరడు కూడ ఆరోగ్యానికి రక్ష కల్పించేవే. నేరేడును ఆయుర్వేదంలో అపర సంజీవనిగా పేర్కొన్నారు.

 చాలామంది డయాబెటిస్‌ వ్యాధికి నేరేడు మహత్తరమైన మందులా భావి స్తారు. అయినా నేరేడులో విశేషమైన ఆమ్లాలు ఉంటాయి. అందులో ఆక్సాలిక్‌ ఆమ్లం, మాలిక్‌ ఆ మ్లం వంటివి ఉండడంతో అవి ఆ పండుకి ప్రత్యేకమైన రుచిని ఆపాదిస్తాయి. పచ్చికాయలను వెనిగర్‌ తయారీకి వాడితే పండిన వాటితో సాస్‌లు తయారు చేస్తుంటారు.

 నేరేడు ఉపయోగాలు : 

 • కడుపులో ఉండే సులిపురుగులను నేరేడు జ్యూస్‌ చంపేస్తుంది.
 • నోటి క్యాన్సర్‌ నిరోధానికి నేరేడు పళ్ల జ్యూస్‌ ఎంతగానో తోడ్ప డుతుంది.
 • కొన్ని దేశాలలో ఈ నేరేడు పళ్లమీద విస్తృత పరిశోధ నలు చేస్తున్నారు. చండ్రు నివారణకు నేరేడు ఎంత గానో ఉపయోగపడుతుందని తెలిసింది.
 • మధుమేహ బాధితులకు నేరేడు పండు వరం లాంటిది. నేరేడు గింజల పొడిని కాచి వడగట్టి తాగితే శరీరంలోని చక్కెర నిల్వల స్థాయి తగ్గుతుంది.
 • మూత్రాశయ సంబంధిత సమస్యలకు నేరేడు పండు మంచి మందుగా పనిచేస్తుంది. మూత్రం రాక ఇబ్బంది పడుతున్నప్పుడు నేరేడు తింటే మంచిదని పలువురు వైద్యులు చెబుతు న్నారు. అవి మూత్ర విసర్జన సాఫీగా అయ్యేలా చూస్తాయంటున్నారు.
 • నేరేడు పండ్లను తరుచూ తినడం మూలంగా క్యాన్సర్‌ రాకుండా నిరోధించవచ్చునని పరిశోధనల్లో వెల్లడైంది.
 • నోటి పూత, చిగుళ్లు, వ్యాధులు దంత క్షయంతో బాధపడేవారు నేరేడు ఆకుల రసాన్ని రోజు పుక్కిలించాలి.  
 • నేరేడు విత్తనాలను బెరడును కాచిచల్లార్చి వడగట్టి తాగితే అతిసార తగు ్గతుంది.
 • నేరేడు జ్యూస్‌ జీర్ణశక్తిని పెంచుతుంది.
 • నేరేడు పండ్లు తింటే వ్యాధి నిరోధక శక్తి పెరిగి రోగాలు దూరం అవుతాయి.
 • దీనిలో విటమిన్‌ ఎ, సి లు పుష్కలంగా లభించడంతో పాటు కాల్షియం ఉంటుంది
1,055 Comments