నంజుండేశ్వరస్వామి గుడి
September 21, 2015 | by admin
నంజుండేశ్వరస్వామి గుడి

సుప్రసిధ్ధ “నంజుండేశ్వరస్వామి గుడి” గురించి తెలుసుకుందామా..?—A.R.సుధాకర్  కపిలానదీతీరాన వెలిసిన వెలిసిన ఈ గుడి అతిపురాతనమైనది..కర్నాటకలోని మైసూరుపట్టణంలో భాగమైన నంజనగూడ్ అనేప్రదేశం, మైసూర్ నుండి కేవలం 25కి.మి.దూరంలో ఉంది. గౌతమ అనే మహర్షి శివలింగాన్ని ఇక్కడ స్థాపించారన్న కధ ఉంది..పరశురాముడుకూడా కొన్ని రోజులు ఈ స్థలిలోవుండి శివుడ్ని ధ్యానించారని చెబుతారు. ఈ గుడిని శ్రీకంఠేశ్వర/నంజుండేశ్వర కోవెలగా పిలవబడుతుంది.. సముద్రంలోని గరళాన్ని తన కంఠంలో బంధించిన కారణంగా శ్రీకంఠేశ్వరుడనే పేరువచ్చింది. గుడిగోపురం యొక్క ఎత్తు 1200 sq.ft. టిప్పుసుల్తాన్ రాజవారి […]

సుప్రసిధ్ధ “నంజుండేశ్వరస్వామి గుడి” గురించి తెలుసుకుందామా..?—A.R.సుధాకర్ 
కపిలానదీతీరాన వెలిసిన వెలిసిన ఈ గుడి అతిపురాతనమైనది..కర్నాటకలోని మైసూరుపట్టణంలో భాగమైన నంజనగూడ్ అనేప్రదేశం, మైసూర్ నుండి కేవలం 25కి.మి.దూరంలో ఉంది. గౌతమ అనే మహర్షి శివలింగాన్ని ఇక్కడ స్థాపించారన్న కధ ఉంది..పరశురాముడుకూడా కొన్ని రోజులు ఈ స్థలిలోవుండి శివుడ్ని ధ్యానించారని చెబుతారు. ఈ గుడిని శ్రీకంఠేశ్వర/నంజుండేశ్వర కోవెలగా పిలవబడుతుంది.. సముద్రంలోని గరళాన్ని తన కంఠంలో బంధించిన కారణంగా శ్రీకంఠేశ్వరుడనే పేరువచ్చింది. గుడిగోపురం యొక్క ఎత్తు 1200 sq.ft.
టిప్పుసుల్తాన్ రాజవారి ఏనుగొకటి తన కంటిచూపుకోల్పోతే, రాజావారే స్వయంగా ఈ ఆలయాన్ని దర్శించి తన గజరాజుకి వెలుగుని ప్రసాదించమని వేడుకున్నాడట..ఆతని పూజలు ఫలించి, ఏనుగుకు చూపురావడంతో ఈ గుడికి “హకీం నజుండేశ్వర” అని నామకరణం చేసాడట..!( హకీం అంటే వైద్యుడని అర్ధం).
ఈ గుడిలో మూడు ముఖ్యమైన విగ్రహాలు., శివుడు., పార్వతీదేవి మరియు శ్రీదేవీ-భూదేవీసమేత నారాయణునివి కొలువున్నాయి. ఇవిగాక వినాయకుడు,సుబ్రహమన్యుడు  మరియు మాతా సరస్వతీదేవీల విగ్రహాలను కూడా దర్శించవచ్చు.. ఇక్కడి శివలింగం ఒక మీటరు ఎత్తులో కొలువైవుంది. ఇవియూగాక, 66 శివభక్తసాధువుల (వీరినే నయమ్నారులంటారు) విగ్రహాలతోబాటూ, వందకు పైచిలుకు శివలింగాలు వివిధ ఆకారాలలో, సైజులలో దర్శనమిస్తాయి..ప్రధానమైన సహస్రలింగాని దర్శించకుండా వెనుదిరిగిరారు భక్తులు. అయితే, ఉన్న అన్నీలింగాలల్లోనూ, నంజుండేశ్వరలింగమే అతిపురాతనమైనదిగా చరిత్ర చెబుతోంది.
మహాశివరాత్రి, గిరిజాకళ్యాణం, పెద్దజాతర, చిన్నజాతర, తెప్పోత్సవము, లక్షదీపారాధనోత్సవము ఇక్కడ భారీఎత్తున పండుగలుగా నిర్వహిస్తారు. దర్శనవేళలు: ఉ:6-మ.1; మరల సా.4-రా:8.

1,024 Comments