ధైవ లీల
September 16, 2014 | by admin
ధైవ లీల

 ధైవ లీల                                   —–ఆర్ . ఉషా వినోద్                                    వినయ్ కి చాల చిరాకుగా వుంది . ఈ మధ్య ఏ  పని చేద్దామనుకున్నా ఏదో ఒక  ఇబ్బంది  ఎదురవ్వటం , అందువల్ల అనుకున్న పని కాకపోవటం జరుగుతుంది . పైగా ఇంట్లో భార్యా , పిల్లలకు , వైద్యం ఖర్చులు కూడా పెరిగి పోయాయి . మొత్తం మీద పరిస్థితులు ఏమి బాగున్నట్లు అనిపించట్లేదు తనకి .కుర్చీకి చతికిలపడ్డ వినయ్ […]

ధైవ లీల ధైవ లీల    

                              —–ఆర్ . ఉషా వినోద్ 

 

                                వినయ్ కి చాల చిరాకుగా వుంది . ఈ మధ్య ఏ  పని చేద్దామనుకున్నా ఏదో ఒక  ఇబ్బంది  ఎదురవ్వటం , అందువల్ల అనుకున్న పని కాకపోవటం జరుగుతుంది . పైగా ఇంట్లో భార్యా , పిల్లలకు , వైద్యం ఖర్చులు కూడా పెరిగి పోయాయి . మొత్తం మీద పరిస్థితులు ఏమి బాగున్నట్లు అనిపించట్లేదు తనకి .కుర్చీకి చతికిలపడ్డ వినయ్ కి ఎదురుగా గొడకున్న కాలెండర్లో చిద్విలాసంగా తపస్సు చేసుకుంటున్న శంకరుని మూర్తి కనిపించింది . వెంటనే ఏదో స్పురించినట్లయి వినయ్  లేచాడు . ఒరేయ్ ! బాబీ ఎ రోజు మనం గుడికి వెళ్దాం  అని బాబి గాడితో చెప్పి స్కూల్ కి పంపాడు . అందరూ భోజనం కానిచ్చి బయట పడ్డారు . శ్రీమతి , తానూ ఎవరి ఆఫీసు లకు వాళ్ళు … దార్లో శ్రీమతి అన్నది … ఏమండి ! ఎ రోజు హనుమద్జయంతి కూడాను … ఆ పక్కనే ఆంజనేయస్వామి వారిని  కూడా దర్శించుకోవచ్చు అన్నది.  సరేనని సాయంకాలం 6 గంటలకు అందరు గుడికి వెళ్లారు . స్వామి ! నీ గుడికి వస్తున్నాను . నాకు మనశాంతిని ప్రసాదించేలా ఏదైనా మహిమను చూపించు — అనుకున్నాడు మనసులో వినయ్ .

గుడిలో గంటలు గణ గణ మ్రోగుతున్నాయి . రద్ధ్హీ అంతకంతకు పెరిగి పోతుంది . చెప్పులు విడిచి అందరూ గుడిలోకి వెళ్లారు . అందరితో బాటు స్వామి దర్శనం చేసి , పులిహోర ప్రసాదం తీసుకుని , మరో ప్రక్కనున్న శివ దర్శనం చేసి , అక్కడికి ఆ వేళ ఓ మహానుభావుడు ఉపన్యాసం చెప్తారని విని కాసేపు అక్కడ కూర్చున్నారు . స్వామి వారు చాల సేపటికి వచ్చారు , ఉపన్యాసం వినే టైం లేదు . కేవలం స్వామి ని దర్శించి , నమస్కరించి వెనుదిరిగారు వినయ్ అండ్ ఫ్యామిలీ . బయటకు రాగానే బాబి గాడి చెప్పులు మాయం . అరె ! ఎవరో చెప్పుల్ని కాజేశారు . అంది శ్రీమతి . మరొక ప్రక్క , మరొక ఇల్లాలు , అవునండి , నా చెప్పులు , మా అమ్మాయి చెప్పులు రెండు జతలు పోయాయి అంది వాపోతూ . సరే .. పోనిలే ఏమి చేస్తాము , చెప్పులు పొతే దరిద్రం పోయినట్లు లెక్క . అందుకే చింతించవద్దు . పద .. అంటూ వినయ్ , బాబి గాడు ఏడుస్తుంటే సర్ది చెప్పి బయలుదేరదీసాడు . స్వామీ ! నీ లీల ఇలా చూపించావా ? … సరే అని నిట్టూర్చాడు మనసులో . ఆహా ! ఎవరో పేదవాడికి , చెప్పులు కొనే స్తోమత లేనివాడికి , నీ గుడికి వద్దనే మా చెప్పులు అందించావయ్య ! ఇంట్లో వాళ్ళం ముగ్గురం , వున్నా చెప్పుల జతలు 6 , అందులో 3 జతలు శ్రీమతివి , 2 జతలు తనవి . బాబిగాడికే పాపం ఒకే జత , పెరిగేవాడు వాడికి ఎక్కువ జతలేందుకు ? అని కొనలేదు . ఇప్పుడు వాడి చెప్పుల జతే పోయింది . .. వాడికి కొనిస్తాములే ,,, సరే కాని తమరికి 2, 3, జతలు అవసరమా ? అసలు చెప్పులు లేని వాళ్ళు ఎంత బాధపడుతుంటారో పాపం ? దాన గుణం లేని తనకు మంచి లీలనే చూపించాడు దేవుడు . అందుకే ఈ జ్ఞానోదయం కలిగించి దేవుడైనాడు . … వినయ్ మనసులోనే స్వామి కి దణ్ణం పెడుతూ. బాబి గాడు తన కొత్త చెప్పులు చూసి తెగ మురిసి పోయాడు .

 

721 Comments
Leave a Reply

— required *

— required *

Theme by Design-Destination, powered by Design-Destination.