సేకరణ - రచన --ఆదూరి.హైమావతి. ఇది రామయణం ఉపన్యాసంగా చెప్తున్న ఒక పండితుని ద్వారా విన్న కధకు స్వంత రూపకల్పన మాత్రమే.,
August 20, 2016 | by admin
ధర్మకాటా—[కథ]

    ధర్మకాటా సేకరణ – రచన –ఆదూరి.హైమావతి. ఇది రామయణం ఉపన్యాసంగా చెప్తున్న ఒక పండితుని ద్వారా విన్న కధకు స్వంత రూపకల్పన మాత్రమే., శ్రీరామచంద్రుడు 12 సంవత్సరాలు అరణ్య వాసం విజయవంతంగా ముగించుకుని ,మహా సాధ్వీమతల్లిఅయిన న సీతమ్మ తల్లిని మోసంతో తీసుకెళ్ళి చెఱపట్టిన అతడి అనుచరులైన ఎందరో క్రూర రాక్షసులను సంహరించి లోకోపకారం గావించి,తిరిగి అయోధ్య చేరుకున్నాడు. పట్టాభిషిక్తుడయ్యాడు.విచారించగా ధనాగారం ఖాళీగా ఉందని తెలుస్తుంది. జరిగినదేంటో గమనిస్తాడు శ్రీరాముడు. ప్రజలనందరినీ తమ,తమ రాబడికి తగిన […]

    ధర్మకాటా

సేకరణ – రచన –ఆదూరి.హైమావతి.

ఇది రామయణం ఉపన్యాసంగా చెప్తున్న ఒక పండితుని ద్వారా విన్న కధకు స్వంత రూపకల్పన మాత్రమే.,

శ్రీరామచంద్రుడు 12 సంవత్సరాలు అరణ్య వాసం విజయవంతంగా ముగించుకుని ,మహా సాధ్వీమతల్లిఅయిన న సీతమ్మ తల్లిని మోసంతో తీసుకెళ్ళి చెఱపట్టిన

 రావణాసురునీ,

రావణాసురునీ,

అతడి అనుచరులైన ఎందరో క్రూర రాక్షసులను సంహరించి లోకోపకారం గావించి,తిరిగి అయోధ్య చేరుకున్నాడు. పట్టాభిషిక్తుడయ్యాడు.విచారించగా ధనాగారం ఖాళీగా ఉందని తెలుస్తుంది. జరిగినదేంటో గమనిస్తాడు శ్రీరాముడు.

ప్రజలనందరినీ తమ,తమ రాబడికి తగిన పన్నుతెచ్చినిండు సభలో చెల్లించవలసినదిగా దండోరా వేయిస్తాడు. ఆ రోజు శ్రీరాముడు సీతమ్మతో కలసి సింహాసనాశీనుడై ఉండగా సభలో సామంత రాజులు, ప్రభుత్వఉద్యోగులు, మంత్రులు,అధికారులూ అంతా కొలువులో తమ,తమ ఉచితాసనాల్లోఆశీనులైఉంటారు.

సభా ప్రాంగణం మధ్యలో ఒక‘కాటా ’ఉంచబడి ఉంటుంది. ప్రజలంతా కట్టవలసిన పన్నులను ప్రభుత్వ ఉద్యోగులు కూడా రాజాఙ్ఞతో తయారు చేసి, మంత్రివరుల పర్యవేక్షణలో సరి చూసుకుని తయారుగాఉంచుతారు .  ఇంతలో సభ మొదలవుతుంది. ఒక్కోరైతుపేరూ, వ్యాపారి పేరూ చదువుతుండగా వారు వచ్చి తాము తమ రాబడికి తగిన విధంగా లెక్కించుకుని తెచ్చిన పన్నును ధనరూపంలో ,కాసులనుసంచుల్లోనూ, ధాన్య రూపంలో పెద్దగోతాల్లోనూ పట్టుకు వచ్చికాటాలో ఒక వైపు ఉంచిన తూకం రాళ్ళకు తగిన బరువుతో రెండవ వైపు తూకానికి ఉంచసాగారు.కొందరు ఒక్క సంచీ ఉంచగానే కాటాపై నున్న ముల్లు కదిలి తూకంసరి చూపసాగింది.మరికొందరు 3,4బస్తాలు వేస్తే తూకం సరిచూపసాగింది.ఇంకా కొందరు పది, పదిహేను బస్తాలు వేసినా సరిపోక , తమ గృహాల నుంచీ ఇంకా తెచ్చి తూకం సరి చూపారు. కొందరు రైతులు నాణాలున్నా,రెండు,మూడు సంచుల వేయగానే కాటా సరి తూచింది.సమయం కావడంతో ఆరోజుకు సభ ముగించి మిగిలిన వారిని మరునాడు వచ్చి పన్ను కట్టవలసినదిగా శ్రీరాముని సూచన మేరకు అధికారులు ప్రకటించారు.                               సీతమ్మ సభలో జరుగుతున్నదంతా చిత్రంగా కళ్ళు ఇంతింత చేసుకుని చూడసాగింది.ఆమెకు అంతా చిత్రంగా అయోమయంగా ఉంది.సభా సమయం పూర్తి కాగానే ఆమె అంతఃపురం చేరి శ్రీరాముని కోసం ఎదురు చూడసాగింది.  ఆయన రాగానే ఇహ ఆపుకోలేక” ప్రభూ! ఏంటీచిత్రం! ధర్మమూర్తి అయిన మీ సభలోనే ఈ విచిత్ర సంఘటన నన్నుఆశ్చర్యపరచడమేకాక, నా మదిలో కొంత శంకను కూడా కలిగిస్తున్నది. తమ సభలో తమ ఎదుట ఇలా జరగడం నామతికి ఏ మాత్రం అర్ధంకావడంలేదు.” అంటూ తన మనోభావాన్నిబయల్పరిచింది.                                      ” సీతా! ఏమీనీశంక ,ముందుఅదిచెప్పు, ఆతర్వాతనీసంశయంతీర్చేప్రయతనంచేస్తాను. ” అంటూ శ్రీరాముడు ఆమెకు భరోసా యిచ్చాడు. సీతమ్మ” స్వామీ! మీరు సభ మధ్యలోఒక కాటా ఉంచారుకదా! అది సరిగా పని చేయలేదని నాభావన.ఎందుకంటే ఒకే తూనికరాయి కొందరు రూకల సంచులు ఉంచినపుడుఒకలాగా ,మరికొందరు ఉంచినపుడు మరొకలాగా సరితూచిందీ? ఒక వ్యాపారికి రెండు సంచులకు సరితూచిన తూనిక రాయి మరొకరికి పది బస్తాలైతే కానీ సరితూచలేదేమీ?ఇదే ప్రభూ నాశంక. మన అధికారులేమైనా మాయచేశారా? లేక అది సరైనత్రాచుకాదా?ఎందు వలన అలా జరిగిందీ?నా సంశయం తీర్చి నా అనుమాన నివృత్తిగావించండీ, ప్రభూ!” అంటూఅడిగింది.                                                                                                                శ్రీరాముడు చిరునవ్వు నవ్వాడు.సభలోనూ జనం పన్ను చెల్లించేప్పుడు ఆయన అదే చిరునవ్వు నవ్వుతూ ఉండటం సీతమ్మ గమనించింది. శీరాముడు దీర్ఘ నిశ్వాస వదలి ఇలా చెప్పసాగాడు.  “సీతా!మనం అరణ్యవాసం చేసేప్పుడు ,మన భరతుడు నగరంలోలేడు కదా! అతడు నాలాగే మౌని దుస్తులు ధరించి మనలాగే కాయలు, పండ్లూ ,అపక్వమైన గడ్డలూ తింటూ నంది గ్రామంలో దీక్షలోఉన్నాడని నీకు తెల్సుకదా! ఆ సమయంలో రైతులను ముందుగా ఆఏడాది ప్రభుత్వానికి పైపంట పన్నుగా కట్టమని చెప్పగానే , రైతులంతా వేరుశనగ, దుంపలు, భూమిలోపండేగడ్డలూ ,దినుసులూ పంటగా వేసి పైన ఉండే గడ్డి పరకలు మాత్రమే పన్నుగా చెల్లించేవారు. దాని వల్ల ప్రభుత్వానికి ఏమాత్రమూ లాభం లేకపోడం గమనించిన భరతుడు ఆతర్వాతి సంవత్సరం,క్రింది పంట పన్నుగా కట్టమని కోరగానే , ఆ సంవత్సరం రైతులువరి ,జొన్న, రాగివంటిధాన్యాలూ, కంది , మినుము , పెసరవంటి చిరు ధాన్యాలూ పండించారు. అపుడు భూమి లోపలిపంట ఆయాడాది కూడా గడ్డి, దాని వ్రేళ్ళూమాత్రమే పన్నుగా ప్రభుత్వానికి దక్కింది. భరతుడు అలా ముందుగా పైపంట, క్రింది పంట అని చెప్పడం వారు మార్చి వేయడం ఉత్తుత్తి గడ్డిగాదం మాత్రం చెల్లించడం జరిగి,ధనాగారం వట్టిపోయింది, అంతా బాగా లాభపడ్డారు. అలా రైతులు, వ్యాపారులూ అంతా అమాయకుడైన భరతుని మోసగించారు.అందువల్లే మన ధనాగారం ఖాళీగా ఉంది.అది గమనించిన నేను ఇంతకాలం వారి రాబడికి తగిన పన్నువారినే లెక్కగట్టి చెల్లించమనికోరాను.వారు అలాగే సొమ్ము, ధాన్యం సంచులతో వచ్చారు.ఐతే ధర్మదేవత, కాటా మీద కూర్చుని ఉండగా వారు నన్నే కాక ధర్మదేవతనూ మోసగించలేకపోయారు.అదే నీవు చూసిన వింత.వారి రాబడి ప్రకారం కాటా సరితూగింది.సీతా!దీన్లో ఏ మోసమూలేదు .ఎవ్వరూఎవ్వరినీ మోసగించడమూ లేదు.అంతా వారి వారి రాబడికి తగిన పన్నుతక్కెడలో వేసినపుడు తూకం సరి తూగింది.అది ప్రజలందరికీ తెల్సు, నిజం బయట పడకుండా వారే తగినంత చెల్లించి వెళ్ళారు.ధర్మదేవత మనకు సహకరించింది.” అంటూ ముగించాడు శ్రీరాముడు.” ప్రభూ నన్నుమన్నించండి! ఇదంతా తెల్సుకోలేక నేనుమిమ్ము అనుమానించాను.” అందిసీతమ్మతల్లి.

అలా అమాయకుడై నభరతుని మోసగించినరైతులు, వ్యాపారులకూ,శ్రీరాముని పరిపాలనలో ఎవ్వరూ ఎవ్వరినీ మోసగించడం జరుగే పని కాదని నిరూపితమైంది.

1 Comment
Leave a Reply

— required *

— required *

Theme by Design-Destination, powered by Design-Destination.