తీరిక సమయం లో సంపాదన
January 31, 2015 | by admin
తీరిక సమయం లో సంపాదన

తీరిక సమయం లో సంపాదన—సంధ్య పాలపర్తి  మన దేశం లోని ప్రజలు ఎక్కువగా మధ్య తరగతి వారు పల్లెల్లో నివసిస్తున్నవారే  వీరిలో కొంతమంది తమ జీవితపు శైలిని మార్చుకోవటానికి ఉద్యోరీత్యా లేదా వ్యాపార రీత్యా నగరాలకి తరలి వస్తున్నారు ,మగవారు తమ పనుల నిమిత్తం బైటకి వెళ్ళినపుడు ఇంట్లోని ఆడవారికి ఖాలీ సమయం అంటూ కొంత ఉంటుంది ,అటువంటి సమయం లో ఇరుగు పొరుగు వారితో కబుర్లు చెప్తూ కాలక్షేపం చేస్తుంటారు ,మరికొంతమంది చదువు కున్నం కదా […]

తీరిక సమయం లో సంపాదనసంధ్య పాలపర్తి 

మన దేశం లోని ప్రజలు ఎక్కువగా మధ్య తరగతి వారు పల్లెల్లో నివసిస్తున్నవారే 

వీరిలో కొంతమంది తమ జీవితపు శైలిని మార్చుకోవటానికి ఉద్యోరీత్యా లేదా వ్యాపార రీత్యా నగరాలకి తరలి వస్తున్నారు ,మగవారు తమ పనుల నిమిత్తం బైటకి వెళ్ళినపుడు ఇంట్లోని ఆడవారికి ఖాలీ సమయం అంటూ కొంత ఉంటుంది ,అటువంటి సమయం లో ఇరుగు పొరుగు వారితో కబుర్లు చెప్తూ కాలక్షేపం చేస్తుంటారు ,మరికొంతమంది చదువు కున్నం కదా ఏదైనా  వుద్యోగం చేస్తే బావుంటుదని అనుకుంటారు . వుద్యోగం చేస్తూ కుటుంబ బాధ్యతలు  చేస్కోవాలంటే కొంచం కష్టం అనే చెప్పవచు అటువంటప్పుడు మన ఇంట్లో కూర్చునే సంపాదించవచ్చు . 
 
మనకు తెలిసిన విద్యనూ నలుగురికి పంచవచ్చు అంటే చిన్న పిల్లలకి ట్యూషన్స్ 
చెప్పటం .అలాగే హోంవర్క్ చేయించటానికి  తీరిక లేని పెద్దలు వుండే ఇళ్ళలో అలాంటి  పనులు చెయ్యొచ్చు  ,చదువు చెప్పటం  డబ్బు  సంపాదనే కాక
మీరు సబ్జెక్టు తోటి టచ్ లో ఉండటమే కాక మీ మెదడు చురుకుగా కూడా ఉంటుంది ఇటువంటి పనిని చదువుకుంటున్న పిల్లలు  చెయ్యొచ్చు కుటుంబ ,ఆర్ధిక పరిస్థితులు సరిగా  లేని తమ కుటుంబానికి సహాయం చేస్తున్నవారవటమే   కాక 
 దీని ద్వారా  ఆత్మ   విశ్వాసంతో పాటు అంతు లేని   సంతృప్తిని  పొందవచ్చు 
 
ఇంట్లోని పుస్తకాలన్నీ పోగుచేసి  చిన్నపాటి గ్రంధాలయాన్ని నడపవచ్చు .పుస్త  కాలు  అద్దెకు ఇవ్వవచ్చు . అందమైన  కార్డ్స్ ,పోస్టర్స్  ,పెయింటింగ్స్ కూడా చేయవచ్చు ,పోట్ పెయింటింగ్ , ఫాబ్రిక్ పెయింటింగ్  చేయవచ్చు. 
 
 
  వంటలు బాగా  చేయటం వచ్చిన వాళ్ళు   ఇంటి దగ్గర  ఆహార పదార్ధాలను చేసి అవసరం అయిన వారికిఅందించవచ్చు  ,పచ్చళ్ళు  పొడులు ,ఊరగాయల,వడియాలు అప్పడాలు , కూడా  చేసి చిన్న చిన్నదుకాణాల్లో   ఇవ్వవచ్చు.  .ఇలాంటి  చిన్న వ్యాపారాలు చేయవచ్చు.    
చాల ఇళ్ళల్లో ఇంట్లోని వారు వంట  చేసి లంచ్ బాక్స్ ఇస్తే వాటిని తీస్కుని మధ్యాన్నం భోజనాల  సమయానికి ఉద్యోగస్తులకి అందించటమే వీరి పని . 
మహా నగరాల్లో ఇటువంటి వ్యాపారం చేస్తున్నవారు ఎందరో ఉన్నారు 
 
అలాగే కరెంటు బిల్ ,టెలిఫోన్ బిల్ ,వాటర్ టాక్స్ ,  ఇంటి పన్ను మొదలైనవి వెళ్లి కట్టలేని వారికీ ,చిన్న బజారు పనులు చేస్కోలేని వారికీ  ఆ పనులు చేసి పెట్టినందుకు ఖర్చుల నిమిత్తం కొంత డబ్బు తీస్కుని చేసి పెట్టవచ్చు.   ఈ విధంగా మీరు సంపాదించు కోవచ్చు 
 
డబ్బు సంపాదించుకోవాలన్న కోరిక దాని కోసం కష్టపడగల తత్వం ఉంటె మీ ఖాలీ సమయాన్ని ఇలా సద్వినియోగం చేస్కోవచ్చు.  దీనివలన మీలో ఆత్మ  విశ్వాసం పెరగటం డబ్బు సంపాదిస్తున్న మన్న సంతృప్తి పెరగటమే కాక  పలువురికి ఆదర్శవంతులుగా   నిలుస్తారు.
797 Comments