October 2, 2014 | by admin
తిరువణ్ణామలై ( అరుణాచలం )

తిరువణ్ణామలై ( అరుణాచలం )                                                                 —ఓం శ్రీకర్ చిట్టా బత్తిన   తిరువణ్ణామలై ( అరుణాచలం )తిరువణ్ణామలై ( అరుణాచలం ) తమిళనాడు  రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో  ముఖ్యమైనది . దాదాపు 1500 సంవత్సరములు చరిత్ర వుంది .                 “అణ్ణామలై” అన్న తమిళ పదానికి అర్ధం ” అనభిగమ్యమైన గిరి ” అని అర్ధం . ఇక్కడ శివుడు అగ్ని  లింగ రూపములో పర్వతాకారముగా వెలసి వున్నాడు. అరుణ అంటే –ఎర్రని , అచలం […]

తిరువణ్ణామలై ( అరుణాచలం )

                                                                —ఓం శ్రీకర్ చిట్టా బత్తిన

 

తిరువణ్ణామలై ( అరుణాచలం )తిరువణ్ణామలై ( అరుణాచలం ) తమిళనాడు  రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో  ముఖ్యమైనది . దాదాపు 1500 సంవత్సరములు చరిత్ర వుంది .

                “అణ్ణామలై” అన్న తమిళ పదానికి అర్ధం ” అనభిగమ్యమైన గిరి ” అని అర్ధం . ఇక్కడ శివుడు అగ్ని  లింగ రూపములో పర్వతాకారముగా వెలసి వున్నాడు. అరుణ అంటే –ఎర్రని , అచలం అంటే కొండ అని , అరుణాచలం అంటే ఎర్రని కొండ , అంటే ఆత్మ  జ్ఞానమును ప్రసాదించే కొండ అని అర్ధం . భగవాన్ శ్రీ రమణులు రెండు దశాబ్దాలకు పైగా , ఈ  అరుణ గిరి పైన నివసించారు .ఇక్కడ శివుడు అద్భుత తేజోలింగముగా  దర్శనమిచ్చిన రోజే  ధనుర్మాస  ఆర్ధ్రశుభదినం . ఆ  విధముగా వెలసిన బ్రహ్మ , విష్ణువు , ఇంద్రాది దేవతలు స్తుతించిన రోజే శివరాత్రి పర్వ దినము   . తాను  జ్యోతి రూపములో ఆవిర్బవించినందుకు గుర్తుగా  కార్తీక పౌర్ణమి రోజున అరుణగిరి శిఖరముపైన జ్యోతి వెలిగిస్తారు . పౌర్ణమి రోజున గిరి శిఖరం మీద  2500 కేజీల నెయ్యితో , 100 మీటర్ల గుడ్డను వత్తిగా చేసి పెద్ద పెద్ద డ్రమ్ములతో గిరి శిఖరానికి చేర్చి సాయంత్రం 6 గంటలకు  దీపాన్ని వెలిగిస్తారు . ఈ జ్యోతి పది రోజుల వరకు దర్శనమిస్తుంది . ఆ రోజున కనీసం 10 లక్షల మంది గిరి ప్రదక్షిణ చేస్తారు .” స్మరణాత్ అరుణాచలం ” అంటే ,అరుణాచలం స్మరణ తోనే సర్వపాపాలు నశిస్తాయని , ప్రతీతి . అరుణాచలం చుట్టూ 3 కిలో మీటర్ల దూరంలో నివసించే సన్మార్గులు ఎటువంటి దీక్ష లేకుండానే శివసన్నిధిని  పొందుతారు.  గిరి ప్రదక్షిణ వలన భక్తులకు కోరిన కోరికలు నేరవేరటమే కాకుండా, భక్తీ, జ్ఞాన, వైరాగ్యాలు కూడా పెరుగుతాయి. గిరి ప్రదక్షిణ చెప్పులు వేసుకోకుండా చేస్తే మంచిది . గిరి ప్రదక్షిణను “అరుణాచలేశ్వర ఆలయం నుంచి ప్రారంభించి చివరకు మల్లి దేవాలయాన్ని దర్శించి గిరి ప్రదక్షిణ పూర్తి  చేస్తారు . రమణాశ్రమం కొరకు వచ్చిన భక్తులు రమణాశ్రమం నుంచి బయలు దేరి చివరకు రమణాశ్రమం వచ్చి ప్రదక్షిణ పూర్తి  చేస్తారు .గిరి ప్రదక్షిణ మంగళవారం మంచిది అని భగవాన్ శ్రీ రమణ మహర్షి చెప్పే వారు . ప్రతి పౌర్ణమికి దాదాపు లక్ష మంది గిరిప్రదక్షిణ చేస్తూవుంటారు అని చెప్తారు . ఈ గిరి ఎత్తు 3000 అడుగులు . ఈ గిరిప్రదక్షిణ 14 kms వుంటుంది . గిరి ప్రదక్షిణ ఎంత రాత్రిపూటైన చెయ్యొచు . గిరి చుట్టూ భక్తులు నడిచేందుకు చక్కని ఫుట్ పాత్ కూడా వుంది . రాత్రంతా కూడా విద్యుత్ దీపాలు వెలుగుతూ వుంటాయి .దారి వెంట టీ అంగళ్ళు  , పలహారాలు అమ్మే విక్రయ శాలలు వుంటాయి . మల, మూత్ర , విసర్జన ప్రదేశాలు కూడా అందుబాటులోనే వుంటాయి . అక్కడక్కడ విశ్రాంతి తీసుకునేందుకు సిమెంట్ బల్లలు కూడా వున్నాయి . దీనికి ఇబ్బంది పడకుండా శ్రమ లేకుండా గిరి ప్రదక్షిణ చేయొచ్చు . కొండకు ఎడమ వైపున మాత్రమే నడవాలి . కుడి వైపున దేవతలు ప్రదక్షిణ చేస్తూ వుంటారు అని వారికి అద్దము పోకూడదు అని భగవాన్ చెప్పే వారు . ప్రదక్షిణ చేసేటప్పుడు ,అరుణాచలశివ , అరుణాచల శివ అని అంటూ తిరిగితే మంచిది .
ఈ గిరి ప్రదక్షిణ లో చూడవలసిన ప్రదేశాలు :
అరుణాచలేశ్వరా లయము నుంచి ప్రారంభిస్తే అగ్ని లింగం , శేషాద్రి ఆశ్రమం , దక్షిణామూర్తి గుడి , రమణాశ్రమం , యమ లింగం , నైరుతిలింగం , సూర్యలింగం , వరుణలింగం , ఆడి అన్నామలై  గుడి , వాయులింగం , చంద్రలింగం , కుబేర లింగం ,ఈశాన్యలింగం , ఇంద్రలింగం వున్నాయి. మార్గ మధ్యమము లో చిన్న చిన్న దేవాలయాలు చాల వున్నాయి . ఇవి అన్ని దేవాలయములు . ఆడిఅన్నామలై లో చాల పురాతనమైన పెద్ద శివాలయం వుంది .ఇది చూడవలసినది . ఇక్కడే మాణిక్య వాచగర్ (ప్రసిద్ద శివ భక్తుడు , తిరువాచక గ్రంధకర్త ) యొక్క చిన్న దేవాలయం వున్నది . వాయులింగం దాటిన  తరువాత కొండకు కుడి వైపుకు తిరిగే ముందు భగవాన్ బ్రిడ్జి వస్తుంది . ఈ బ్రిడ్జి దగ్గర భగవాన్ గిరి ప్రదక్షిణ చేసే రోజులలో కాసేపు కూర్చుని విశ్రాంతి తీసుకునే వారట . భగవాన్ భక్తులు కూడా ఈ బ్రిడ్జి దగ్గర కాసేపు కూర్చుని విశ్రాంతి తీసుకుంటే మంచిది . కుబేర లింగం దాటినా తరువాత కొంచం దూరం వస్తే , రోడ్ కు కుడి వైపున “ఇరుక్కు పిళ్ళై యార్ “అని అతి చిన్న ద్వారం వుంది . అది కేవలం ఒక మనిషి మాత్రమె దూరగలిగినది . అక్కడ దూరి వస్తే , కస్టాలు పరిహారమవుతాయని భక్తులు నమ్ముతారు.
                   రమణాశ్రమము లో చూడవలసిన ప్రదేశాలు :మాతృ భూతేశ్వరాలయం ,మహర్షి సమాధి మందిరం , మహర్షి దేహ త్యాగము చేసిన గది , భగవాన్ భక్తుల సమాధులు , గోవు లక్ష్మీ సమాధి , కుక్క ( జాకీ ), కాకి , జింక ( వల్లి ) ల సమాధులు . రమణాశ్రమంలో  నుంచి కొండ పైకి దారి వుంది . దాదాపు 2 kms నడక దారి . చాలా ఆహ్లాదకరంగా  వుంటుంది . మొదట స్కందాశ్రమం వస్తుంది . భగవాన్ ఇక్కడ 6 సంవత్సరములు వున్నారు . ఇక్కడే భగవాన్ తమ తల్లికి మోక్షాన్ని అనుగ్రహించినారు . తరువాత కొంచం కొండ ముందు వైపుకి దిగితే విరుపాక్ష గుహ వస్తుంది . భగవాన్ కు పూర్వం కొన్ని శతాబ్దాల ముందు విరుపాక్ష స్వామి అనే ఒక యోగి వుండేవారట . ఈ గుహలో వారి సమాధి వుంది . ఈ గుహ లో భగవాన్ 16  సంవత్సరములు వున్నారు. ఇక్కడి నుండే వారు ప్రపంచం నలుమూలల నుండి భక్తులను ఆకర్షించారు . విరుపాక్ష గుహ నుంచి కొండ దిగి మెయిన్ రోడ్ లోకి వెళ్తే అరుణాచలేశ్వరా లయము వస్తుంది .
అరుణాచలేశ్వరా లయము అద్భుతమైన శివాలయం . తూర్పు వైపు గోపురం 217 అడుగుల ఎత్తు వుంటుంది .  భగవాన్ తిరువణ్ణామలై కి వచ్చిన తరువాత అరుణాచలేశ్వరా లయము లోని పాతాళ లింగం దగ్గర ఎక్కువ రోజులు శరీరాన్ని మరచి పురుగులు తొలుస్తున్న , శరీరమంతా పుండ్లు పడిన ధ్యానము లోనే వుంది పొయ్యారు ఇది తప్పక చూడవలసిన ప్రదేశము. వెయ్యి స్తంబాల మంటపము కూడా ప్రదాన ఆకర్షణ . ఈ విశాలమైన ఆలయం లో ,అనేక సన్నిధులు , మంటపాలు, గోపురాలు  వున్నాయి .
అరుణాచలము లో ఆంధ్రఆశ్రమాలు కూడా వున్నాయి . తిరువణ్ణామలై కి తిరుపతి నుంచి వెల్లూరు మీదుగా వెళ్ళొచ్చు . చెన్నై నుంచి కూడా డైరెక్ట్ బస్సులు వున్నాయి . కాట్పాడి ,తిరువణ్ణామలై కి దగ్గరి రైల్వే స్టేషన్ . కాట్పాడి రైల్వే స్టేషన్ నుంచి వెల్లూరు న్యూ బస్సు స్టాండ్ కు షేర్  ఆటోస్ వుంటాయి . 3 kms దూరం వుంటుంది . వెల్లూరు న్యూ బస్సు స్టాండ్ నుంచి తిరువణ్ణామలై బస్సులు కలవు . తిరుపతి నుంచి తిరువణ్ణామలైకు “పమని ” ఎక్ష్ప్రెస్స్ ఉదయం 10 గంటలకు వుంది .
      అరుణాచలశివ …. అరుణాచలశివ…. అరుణాచలశివ…. అరుణాచల
324 Comments
Leave a Reply

— required *

— required *

Theme by Design-Destination, powered by Design-Destination.