May 16, 2017 | by admin
తాటి ముంజలు (ice apples)

తాటి ముంజలు (ice apples) ఎండాకాలం లో మాత్రమే దొరికే “తాటి ముంజలు”ప్రకృతి మనకు ఇచ్చిన వరం గా చెప్పవచ్చు. ఈ ముంజలను ఐస్ ఆపిల్స్‌గా పిలుస్తుంటారు. ఈ ముంజలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. మంచి చలువ కూడా. కేలరీలు, విటమిన్లు అధికంగా ఉన్న ఈ ముంజలను తినడం ఆరోగ్యానికి మంచివి. ఈ ఐస్ ఆపిల్ లో బోలెడు హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఇందులో విటమిన్ బి, ఐరన్, కాల్షియం వంటివి పుష్కలంగా ఉంటాయి. […]

తాటి ముంజలు (ice apples)

ice-apples

ice-apples

ఎండాకాలం లో మాత్రమే దొరికే “తాటి ముంజలు”ప్రకృతి మనకు ఇచ్చిన వరం గా చెప్పవచ్చు. ఈ ముంజలను ఐస్ ఆపిల్స్‌గా పిలుస్తుంటారు. ఈ ముంజలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. మంచి చలువ కూడా. కేలరీలు, విటమిన్లు అధికంగా ఉన్న ఈ ముంజలను తినడం ఆరోగ్యానికి మంచివి. ఈ ఐస్ ఆపిల్ లో బోలెడు హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఇందులో విటమిన్ బి, ఐరన్, కాల్షియం వంటివి పుష్కలంగా ఉంటాయి. కల్తీ లేకుండా ఉండే తాటిముంజలు ఇష్టపడనివారు ఎవరూ ఉండరు. ఆరు అరటిపండ్లలో ఉండే పొటాషియం ఒక్క తాటి ముంజలో ఉంటుంది బి.పిని అదుపులో ఉంచి కోలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. ఎముకలను బలంగా ఉంచుతుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.శరీరం కూడా ఎంతో చల్లగా , హాయిగా ఉంటుంది. తాటి ముంజ మనిషికి ఎంతో మేలు చేస్తుంది. మనిషి శరీరంలోని ఉష్ణోగ్రత తగ్గి జీర్ణక్రియ బాగా జరుగుతుంది. శరీరానికి మంచి చల్లదనాన్ని అందిస్తుంది. ఎండాకాలం ఈ తాటి ముంజల్లో నీళ్లు చాలా చలువ చేస్తాయి. తాటి ముంజల్లో అధిక నీటిశాతం ఉండటం వల్ల దీని వల్ల శరీరానికి తగినంత తేమ అందించి, చర్మంను, శరీరాన్ని చల్లగా ఉంచేందుకు గొప్పగా సహాయపడుతుంది.సో ఎండాకాలానికి చెక్ పెట్టడానికి తాటి ముంజలు తినండి…

543 Comments
Leave a Reply

— required *

— required *

Theme by Design-Destination, powered by Design-Destination.