గుడ్డు -సుధారాణి మన్నె
January 6, 2015 | by admin
గుడ్డు -సుధారాణి మన్నె

*గుడ్లు చాలా చవకైన పౌష్టికాహారము .  ఎదిగే పిల్లలకు చాలినన్ని ప్రోటీన్లు అందజేస్తుంది . పోషకాహారలేమితో బాధపడేవారిని రోజుకో గుడ్డు తినాల్సిందిగా డాక్టర్స్ సలహాలిస్తుంటారు .  *గుడ్లలో పోషకాలు, ఖనిజాలు, విటమిన్లు,మాంసకృత్తులు సమృద్ధిగా ఉంటాయి .   కండపుష్టికి , కండర నిర్మాణానికి ఎంతో మేలుచేస్తుంది .  తేలికగా జీర్ణము కాదుగనుక తొందరగా ఆకలివేయదు .   * గుడ్డులోని పచ్చసొనలో కొలెస్ట్రాల్‌ అధికంగా ఉంటుందని కొందరు గుడ్లను పూర్తిగా మానేస్తుంటారు. కానీ వీటిని మితంగా తింటే ఎలాంటి నష్టమూ […]

గుడ్డు -సుధారాణి మన్నె

గుడ్డు -సుధారాణి మన్నె

*గుడ్లు చాలా చవకైన పౌష్టికాహారము .  ఎదిగే పిల్లలకు చాలినన్ని ప్రోటీన్లు అందజేస్తుంది . పోషకాహారలేమితో బాధపడేవారిని రోజుకో గుడ్డు తినాల్సిందిగా డాక్టర్స్ సలహాలిస్తుంటారు . 
*గుడ్లలో పోషకాలు, ఖనిజాలు, విటమిన్లు,మాంసకృత్తులు సమృద్ధిగా ఉంటాయి . 
 కండపుష్టికి , కండర నిర్మాణానికి ఎంతో మేలుచేస్తుంది .  తేలికగా జీర్ణము కాదుగనుక తొందరగా ఆకలివేయదు .  
* గుడ్డులోని పచ్చసొనలో కొలెస్ట్రాల్‌ అధికంగా ఉంటుందని కొందరు గుడ్లను పూర్తిగా మానేస్తుంటారు. కానీ వీటిని మితంగా తింటే ఎలాంటి నష్టమూ ఉండదు.
* ఉదయాన్నే అల్పాహారంగా పిండి పదార్థాలు ఎక్కువగా ఉండే ఉప్మాలు, బ్రెడ్ల వంటి వాటికి  బదులు గుడ్లను తింటే రక్తంలో మంచి కొవ్వు అయిన హెచ్‌డీఎల్‌ స్థాయులు మెరుగుపడతాయి. ట్రైగ్లిజరైడ్ల మోతాదులు తగ్గటానికీ దోహదం చేస్తాయి. ఇవి రెండూ గుండె ఆరోగ్యంగా ఉండటానికి దోహద పడతాయి . 
* ప్రోటీన్లతో నిండిన గుడ్లలో మనకు అవసరమైన అన్నిరకాల అమైనో ఆమ్లాలు ఉంటాయి. శారీరకశ్రమ అధికంగా చేసినప్పుడు తిరిగి శక్తిని పుంజుకోవటానికి ఇవి ఎంతగానో ఉపయోగ పడతాయి.
* మన శరీరం అవసరమైనంత మేరకు కోలిన్‌ను తయారుచేసుకోలేదు. ఇది లోపిస్తే కాలేయజబ్బు, ధమనులు గట్టిపడటం, నాడీ సమస్యల వంటి వాటికి దారితీస్తుంది. కాబట్టి కోలీన్‌ అధికంగా ఉండే గుడ్లను తీసుకోవటం మేలు. ముఖ్యంగా గర్భిణులకు ఇదెంతో అవసరం.
1 Comment
Leave a Reply

— required *

— required *

Theme by Design-Destination, powered by Design-Destination.