ఆలయం
October 4, 2015 | by admin
గర్భ గుడిలోకి వెళ్లేముందు గడపకు ఎందుకు నమస్కరించాలి?

ఆలయం లోని గర్భ గుడిలోకి వెళ్లేముందు ప్రదాన ద్వారం వద్ద వున్న గడపకు నమస్కరిస్తాము.ఇలా ఎందుకు చేస్తున్నామనే విషయము చాలా మందికి తెలియదు.వాస్తవానికి ఇళ్ళకు చెక్కతో చేసిన గడప వుంటుంది.ఆలయాలకు అయితే రాయి తో చేసిన గడప వుంటుంది. ఆలయాలకు రాతి తోనే ఎందుకు గడపలు చేస్తారు?మనం ఆ గడపలకు ఎందుకు నమస్కరించాలి?అనే అంశాలను పరిశీలిస్తే “రాయి”పర్వతానికి చెందింది.”భద్రుడు”అనే రుషి  భద్రమనే పర్వతం గా హిమవంతుడు అనే భక్తుడు హిమాలయం గాను “నారాయణుడు”అనే భక్తుడు నారయణాద్రిగాను అవతరించాడని […]

ఆలయం లోని గర్భ గుడిలోకి వెళ్లేముందు ప్రదాన ద్వారం వద్ద వున్న గడపకు నమస్కరిస్తాము.ఇలా ఎందుకు చేస్తున్నామనే విషయము చాలా మందికి తెలియదు.వాస్తవానికి ఇళ్ళకు చెక్కతో చేసిన గడప వుంటుంది.ఆలయాలకు అయితే రాయి తో చేసిన గడప వుంటుంది. ఆలయాలకు రాతి తోనే ఎందుకు గడపలు చేస్తారు?మనం ఆ గడపలకు ఎందుకు నమస్కరించాలి?అనే అంశాలను పరిశీలిస్తే “రాయి”పర్వతానికి చెందింది.”భద్రుడు”అనే రుషి  భద్రమనే పర్వతం గా హిమవంతుడు అనే భక్తుడు హిమాలయం గాను “నారాయణుడు”అనే భక్తుడు నారయణాద్రిగాను అవతరించాడని పురాణాలు చెపుతున్నాయి.ఈ భక్తుల కోసం భగవంతుడు కూడ ఆ కొండల మధ్యే వెలిసాడు.అందుకే ఆ కొండ రాళ్ళ నుండి వచ్చిన రాయిని మలిచి ఆలయ గర్భ గుడులకు గడపగా పెట్టారని శాస్త్రాలు చెపుతున్నాయి.అయితే ఆ గడప నిత్యం  దైవాన్ని దర్శిస్తూ వుంటుంది.అందుకే ఆ గడప రాయి చేసుకున్న పుణ్యానికి నమస్కరిస్తూ, కొండ రాయిగా మారిన భక్తుడిని దాటుతున్నందుకు క్షమించమని వేడుకోవడమే గడపకు నమస్కరిస్తారని పురాణాలు చెపుతున్నాయి.అందుకే ఆలయాల్లో గడప తొక్కకుండా కేవలం దాటాలని ఆద్యాత్మిక వేత్తలు సూచిస్తున్నారు.

438 Comments
Leave a Reply

— required *

— required *

Theme by Design-Destination, powered by Design-Destination.