కార్టూనిస్ట్ “నాగ్రాజ్” గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ ...
May 15, 2016 | by admin
కార్టూనిస్ట్ “నాగ్రాజ్” గారితో ఇంటర్వ్యూ …

బ్రహ్మం గారు ,భవిష్యత్తుని “కాల జ్ఞానం “గా చెపితే..”రాబోవు రోజుల్లో”ప్రపంచం ఎలా వుంటుందో కార్టూనిస్ట్ “నాగ్రాజ్” తన” రాబోవు రోజుల్లో” శీర్షికన వేసిన కార్టూన్ల ద్వారా కళ్ళకు కట్టినట్టు చూపించాడు. “రాబోవు రోజుల్లో” తను వేసిన కార్టూన్లన్ని జీవిత సత్యాలు.భవిష్యత్తులో “నీటి” సమస్య ఎంత  ఉదృతంగా వుంటుందో చూపిస్తే నవ్వు కున్నాము .కాని ఇప్పుడు దేశ వ్యప్తంగా తీవ్ర నీటి ఎద్దడి ని ఎదుర్కొంటున్నాము.కొన్ని ఊళ్లకు నీటిని రైళ్ళలో సరఫరా చేస్తుంటే  “నాగ్రాజ్” కార్టూన్ల విలువ తెలిసింది.ఇలా ఒక్క […]

బ్రహ్మం గారు ,భవిష్యత్తుని “కాల జ్ఞానం “గా చెపితే..”రాబోవు
రోజుల్లో”ప్రపంచం ఎలా వుంటుందో కార్టూనిస్ట్ “నాగ్రాజ్” తన” రాబోవు
రోజుల్లో” శీర్షికన వేసిన కార్టూన్ల ద్వారా కళ్ళకు కట్టినట్టు చూపించాడు.
“రాబోవు రోజుల్లో” తను వేసిన కార్టూన్లన్ని జీవిత సత్యాలు.భవిష్యత్తులో
“నీటి” సమస్య ఎంత  ఉదృతంగా వుంటుందో చూపిస్తే నవ్వు కున్నాము .కాని ఇప్పుడు
దేశ వ్యప్తంగా తీవ్ర నీటి ఎద్దడి ని ఎదుర్కొంటున్నాము.కొన్ని ఊళ్లకు
నీటిని రైళ్ళలో సరఫరా చేస్తుంటే  “నాగ్రాజ్” కార్టూన్ల విలువ
తెలిసింది.ఇలా ఒక్క సమస్యే కాదు..”పర్యావరణం,కాలుష్యం,కుటుంబ
విలువలు,యువత నడత,స్మార్ట్ ఫోన్స్,ఫేస్బుక్,వివాహ వ్యవస్త ,చెట్లు,మానవ
జీవన విదానం మీద అనేక కార్టూన్లు గీసి  హాస్యం తో పాటు
సందేసాన్నిచ్చాడు.ఈ  రోజుకి ” రాబోవు రోజుల్లో” వంద కార్టూన్స్ పూర్తి
అయిన సంధర్భం గా కార్టూనిస్ట్ “నాగ్రాజ్” గారితో  ప్రత్యేక ఇంటర్వ్యూ …

1.     తలిసెట్టి రామారావు కార్టూన్ల పోటీలో మీకు “విశిష్ట బహుమతి”
వచ్చినందుకు   ముందుగా మీకు అభినందనలు.
ధన్యవాదములు సర్..
2.     మీ గురించి చెప్పండి?
నా పూర్తి పేరు  వాసం నాగరాజ్ ,  మా తల్లి తండ్రులు  సరోజినీ,
గంగాధర్,  భార్య విశ్వద , మాకు కవల కూతుర్లు  షణ్ముఖి , ధరణి.
మా స్వగ్రామం  మెట్పల్లి , జిల్లా కరీంనగర్ .  రెడీ మేడ్ వస్త్ర
వ్యాపారం  మా తమ్ముడు నేను కలిసి చూసుకుంటాం

3.       మీరు కార్టూన్స్ వెయ్యడం ఎప్పటినుండి మొదలెట్టారు?
2008  డిసెంబెర్ నెల లో నా మొదటి కార్టూన్  ఆంధ్రభూమి మాస
పత్రికలో వచ్చింది , అది మొదలు…

4.       ఇప్పటివరకు ఎన్ని కార్టూన్స్ గీసారు?
ఇప్పటి వరకు దాదాపు  1000 వరకు అచులో వచ్చి ఉంటాయి .

 1.      ప్రముఖ కార్టూనిస్ట్ ,కార్టూనిస్టులకి గురువుగారు అయినటువంటి
  శ్రీ జయదేవ్ గారితో కలిసి కార్టూన్స్ గీసారు కదా!దాని గురించి చెప్పండి?
  గురుదేవేవులు  శ్రీ జయదేవ్  బాబు గారితో కలిసి
  www.gotleugu.com   పత్రికలో  మూడు కార్టూన్లలో పాలు పంచుకున్నాను  అది
  నా               అదృష్టం గా   భావిస్తాను ,   ఆయన నాకు కార్టూన్లు వేయడం
  లో ఎన్నో మెళకువలు నేర్పారు , కాప్షన్ లెస్ కార్టూన్స్ వేయడం ఆయన
  నుండే అలవరచుకున్నాను.
 2. 6.       ఇక ఒకటే సబ్జెక్టు తీసుకుని  “రాబోవు రోజుల్లో”పేరు తో
  ఇప్పటివరకు వంద కార్టూన్స్ గీసారు కదా!ఎలా అనిపించింది?
  ఒకే సబ్జెక్టు పైన కార్టూన్లు అంటే ముందుగా కొంచెం భయం
  అనిపించింది , కాని మిత్రులు  కార్టూనిస్టు  రామ్ శేషు  గారి ప్రోత్సాహం, మరియు  కార్టూనిస్టు మిత్రుల సహకారం వుంది .  వలన ఇది సాధ్యం అయింది   .7       ఈ  కార్టూన్ల ద్వారా మీరు ఎం చెప్పదల్చుకున్నారు ?

  సందేశం లాంటి వి ఏమి చెప్పదలచు కో లేదండి ,  ఎందుకంటే ,  ఆధునిక
  సాంకేతిక యుగంలో  అన్ని రకాల విషయ పరిజ్ఞానం  అందరికి
  నిముషాలలో అందుబాటులో ఉంటుంది,  పైగా చెబితే గాని తెలుసుకోలేని
  పరిస్థితిలో ఎవరు లేరు, “ రాబోవు రోజుల్లో” పరిస్థితులు ఇలా వుంటాయి    కాబోలు  అని నాకు అనిపించింది  వేసాను   అంతే .

  8       మీకు ఇష్టం అయిన  కార్టూనిస్టు ఎవరు  ?

  తెలుగు లో కార్టూన్లు వేసే ప్రతి ఒక్కరు ,  ఎందుకంటే  ప్రతి
  ఒక్క కార్టూనిస్టు దగ్గర ఒక ప్రత్యేకమైన శైలి ఉంటుంది , విషయం ఉంటుంది
  అందరి దగ్గర ఒక్కో విషయం నేను నేర్చుకుంటున్నాను
  9      ఈ  కార్టూన్ లని మేము పుస్తక రూపంలో చూడ వచ్చా ?

  అది దైవ నిర్ణయం.. చూడాలి

  10     మీరు  లబ్ద ప్రతిష్టులైన  5 గురు కార్టూనిస్టులతో  కలసి  మాదాపూర్
  స్టేట్ ఆర్ట్ గల్లరి లో కార్టూన్  ఎక్షిబిసన్  పెట్టారు కదా ఆ అనుభవం
  చెప్పండి ?

  సర్వశ్రీ  ms  రామకృష్ణ గారు , సరసి గారు , బాచి గారు , లేపాక్షి
  గారు , బండి రవీందర్ గారి తో కలసి మాదాపూర్ స్టేట్ ఆర్ట్ గ్యాలరి లో
  కార్టూన్
  ఎగ్జిబిషన్ అదొక మరపురాని అనుభూతి , నేను నా జీవితం లో కూడా
  చేయలేని పని ఆ మహామహులతో కలిసి చేసే అవకాశం  వచ్చింది ,            వారి
  ప్రోత్సాహాన్ని నేను జన్మలో మరవలేను ,  వారికి నా హృదయపూర్వక నమస్సులు .
  11     తెలుగు కార్టూనిస్ట్ ల గూర్చి , కార్టూన్ ల గూర్చి చెప్పండి  ?
  మన తెలుగు కార్టూనిస్ట్ లలో ఉన్నంత సుహృద్భావ వాతావరణం  మరెక్కడా
  నాకు కనిపించలేదు , పరస్పర సహకారం, స్నేహం, ప్రోత్సాహం ,
  మన తెలుగు కార్టూనిస్టుల లో ఉంది అని నేను ఘంటా  పదంగా చెప్పగలను
  12     చివరిగా ఏదైనా  మంచి విషయం చెప్పండి  ?
  ముందే చెప్పను కదండీ ,   సందేశాలు నేను ఇవ్వను ,
  కార్టూనిస్టుల  గురువు శ్రీ జయదేవ్ బాబు గారి ప్రోత్సాహాన్ని
  నేను రుణ పది ఉంటాను,  నేను అన్నగా పిలుచుకునే  మా అన్న శ్రీ బాచి
  [ అన్నం శ్రీధర్ ]. గారి సహాయ సహకారాలు , ప్రోత్సాహం నా పూర్వ జన్మ
  సుకృతం ,  శ్రీ రామ్ శేషు  గారి లాంటి  మిత్రులు ఒక్కరున్న చాలు
  ఏదైనా సాధించగలం  మీకు హృదయ పూర్వక వందనం ,  సర్వశ్రీ  కళాసాగర్
  గారు , బన్ను గారు  , నూకా పతి గారు, మాధవ్ గారు , కందికట్ల గారు,  వడ్డేపల్లి వెంకటేష్ గారు , అర్జున్ గారు ,
  సరసి గారు, లేపాక్షి గారు , ms రామకృష్ణ గారు , బండి రవీందర్ గారు
  , హాస్యానందం మాస పత్రిక సంపాదకులు రాము గారు ,  చక్రవర్తి గారు
  విజయ్ గారు , వినోద్ గారు , రామకృష్ణ పుక్కళ్ళ గారు ,  శ్రిగద్దె
  శంకర్ గారు ,  చిన్నన్న గారు , భోగ అశోక్ గారు , avm గారు , సాయి కృష్ణ
  పొన్నగంటి గారు , సంతోష్ కౌటం గారు, అబ్దుల్ రెహ్మాన్[బోసు] ,కొండా రవి ప్రసాద్ ,వేముల రాజ మౌళి  అందరికి జన్మ జన్మాలకు రుణ పడి ఉంటాను . . . . . .. . .
  . .  ఎందరో మిత్రులు  పేరు మరచి ప్రస్తావించకపోతే స హృదయం తో మన్నీంచి
  ఆశీర్వదించగలరు.                      ఇంటర్వ్యూ

భీశెట్టి శేషగిరి రావు

1,170 Comments