కాకర కాయ
December 6, 2015 | by admin
“కాకర” తో ఆరోగ్యం

“కాకర” తో ఆరోగ్యం  “కాకర” తో కూర అంటే చాలా మంది మొహం చేదుగా పెడతారు.కాని రోజు వారి వినియోగం లో “కాకర” కాయ కు ఎంతో ప్రాదాన్యం వుంది. “కాకర”కాయను ఆహార పదార్థాలతో వాడితే ఎన్నో రోగాలను నయం చేస్తుంది. “కాకరకాయ”రసం ను తాగడం వలన “ప్రాంకియాస్ లోని [ఐ లెట్ ఆఫ్ లాంగేర్ ఆన్స్లు]బీటా సెల్ల్స్ బాగా స్టిమ్యూలేషన్ కు లోనై ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది.తద్వారా మధు మేహం అదుపులో ఉంచుతుంది.అయితే ఆహార పరిమితి […]

“కాకర” తో ఆరోగ్యం 

“కాకర” తో కూర అంటే చాలా మంది మొహం చేదుగా పెడతారు.కాని రోజు వారి వినియోగం లో “కాకర” కాయ కు ఎంతో ప్రాదాన్యం వుంది. “కాకర”కాయను ఆహార పదార్థాలతో వాడితే ఎన్నో రోగాలను నయం చేస్తుంది. “కాకరకాయ”రసం ను తాగడం వలన “ప్రాంకియాస్ లోని [ఐ లెట్ ఆఫ్ లాంగేర్ ఆన్స్లు]బీటా సెల్ల్స్ బాగా స్టిమ్యూలేషన్ కు లోనై ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది.తద్వారా మధు మేహం అదుపులో ఉంచుతుంది.అయితే ఆహార పరిమితి కూడా అవసరం. “కాకరకాయ”రసం,నిమ్మ రసం కలిపి రోజు ఒక స్పూను ,పరగడుపున కొద్ది  రోజులు సేవించిన చర్మ వ్యాధులు తగ్గుతాయి. “కాకరకాయ”రసం రెండు చెంచాలు, మజ్జిగ ఒక గ్లాస్ చొప్పున మూడు నెలలు సేవించిన మొలల రోగులకు  చక్కని ఉపశమనం కలుగుతుంది.కాకర కాయ మేను మెత్తగా నూరి అందులో తులసి రసం,తేనే కలిపి ప్రతి రాత్రి తాగిన ఆస్తమా, బ్రాంకటైస్,జలుబు,గొంతు గరగరలు తగ్గుతాయి. “కాకరకాయ”రసం రాసిన కాళ్ళు,చేతులు మంట తగ్గుతుంది. రెండు చెంచాల కాకర ఆకుల రసం, నిమ్మ రసం,వుల్లిపాయల రసం ఒక చెంచా కలిపి ,ఉదయం,సాయంత్రం తాగించిన వేసవిలో వచ్చే విరోచనాలలో ఎంతో ఉపయుక్తంగా వుంటుంది.కాకర పండ్లను సేవించిన జ్వరాలను నిరోధించే గుణం కలిగి వుంది.లివర్, స్ప్లీన్ రోగులకు “కాకర కాయ” వాడకం మంచిది.

1,017 Comments