ఏది ఎక్కడ ఉండాలో అక్కడే
June 2, 2015 | by admin
ఏది ఎక్కడ ఉండాలో అక్కడే

ఏది ఎక్కడ ఉండాలో అక్కడే స్వంత ఇల్లు కట్టుకునేటప్పుడు   ముందుగానే ఒక పద్దతి ప్రకారం  ప్రతి ఒక వస్తువుకు ఒక స్థానాన్ని  ఏర్పాటు చేస్కుంటే ఇల్లు ఎంతో  అందంగానూ చూడ ముచ్చట గాను అలంకరించు కోవచ్చు . ఇల్లంటేనే  సౌకర్యల నిధిల వుండాలి . మనం భద్రపరచుకోవాల్సిన వస్తువులను దృష్టిలో పెట్టుకుని ఇంట్లో అలమారాలు ,బీరువాలు లాంటివి డిజైన్ చేస్కుంటే ఏ వస్తువు ఎక్కడ ఉంచాలనేది ప్రణాళిక  చేస్కోవచ్చు .    బయట నుండి రాగానే మెడ లో వేస్కున్న గొలుసులు ,చేతి గాజులు ,చలువ […]

ఏది ఎక్కడ ఉండాలో అక్కడే

స్వంత ఇల్లు కట్టుకునేటప్పుడు   ముందుగానే ఒక పద్దతి ప్రకారం  ప్రతి ఒక వస్తువుకు ఒక స్థానాన్ని  ఏర్పాటు చేస్కుంటే ఇల్లు ఎంతో  అందంగానూ చూడ ముచ్చట గాను అలంకరించు కోవచ్చు . ఇల్లంటేనే  సౌకర్యల నిధిల వుండాలి . మనం భద్రపరచుకోవాల్సిన వస్తువులను దృష్టిలో పెట్టుకుని ఇంట్లో అలమారాలు ,బీరువాలు లాంటివి డిజైన్ చేస్కుంటే ఏ వస్తువు ఎక్కడ ఉంచాలనేది ప్రణాళిక  చేస్కోవచ్చు . 

 
బయట నుండి రాగానే మెడ లో వేస్కున్న గొలుసులు ,చేతి గాజులు ,చలువ కళ్ళ అద్దాలు ,బ్రేస్ లేట్ ,నడుముకు పెట్టుకునే బెల్టు ,బండి తాళాలు ,తలకు పెట్టుకునే హేల్మట్ ,స్కార్ఫు ఇలాంటివన్నీ తీసి ఏ అలమరలోనో బల్ల సొరుగు లోనో లేదా ఏ టేబుల్ మీద పెట్టిన కూడా అవన్నీ అక్కడ అడ్డ దిడ్డంగా పడేసినట్టుగాను ,ఉండటమే కాకుండా చూడటానికి ఇల్లు ముచతగా అనిపించదు ,అలా కాకుండా ఉండాలంటే ఇంటిరియర్ డిజైన్ చేసేటప్పుడు వాటికోసమే ప్రత్యెక ప్రదేశాన్ని ఏర్పాటు చేస్కోవాలి . దేనికోసం ఆ ప్రదేశం అన్నట్లుగా ఉండే షెల్ఫులు వస్తువుల భద్రతకు ఏంతో అనువైనవి దుస్తులతో పాటు బూట్లు ,బ్యాగులు ,పుస్తకాలు ,సి డి లకు సైతం అనువైన ప్రదేశాన్ని సృష్టించుకోవచ్చు . రక రకాల ఫాన్సీ నగల కోసం వేల్వాతే క్లాత్ తో లైనింగ్ వేసిన నగల డ్రాలు ఇందులో మళ్లి  నెక్లసులు   ,జుంకాలు బ్రెస్ లేటేస్ ,ఉంగరాలు ,గజ్జెలు ,పాపిట బిల్లలు మొదలైన వాటి కోసం విడి విడిగా అరలు ఏర్పాటు చేసుకుంటే నగలు చిక్కులు పడకుండా ఉంటాయి డ్రా సోరుగులకు ఏర్పాటు చేస్కునే డి వైడర్లు    
మార్చుకునేందుకు వీలుగా ఉంటె మరిన్ని వస్తువులను భద్ర పరచుకునేందుకు వీలుగా వాటిని మార్చుకుంటూ ఉండవచ్చు . 
 
ఇంటిని ,ఇంటి అలంకరణ ని   ,చూడగానే స్వర్గంలో ఉన్న అనుభూతి కలగక మానదు 
మరి మీరు ఇల్లు కట్టుకునే ముందే ప్రతివస్తువుకూ స్తానాన్ని ఏర్పరచుకుంటారు కదూ 
 
పాలపర్తి సంధ్యారాణి 
707 Comments