Ugadi
September 25, 2014 | by admin
ఉగాది వసంత లక్ష్మి

ఉగాది వసంత లక్ష్మి               —–నరెంద్రబాబు గుండాల ఎప్పటిలాగే … ఈ యేడాది కూడా  తెలుగు సంవత్సరాది ఉగాది  నిరాశా  నిస్పృహ లని  పండుటాకుల్లా రాల్చి  నవ నవ లాడే లేలేత చిగురాకుల చీర చుట్టుకొని  నుదుటున తూరుపుసింధూరాన్ని దిద్దుకుని  శిగలో  సిరి మల్లెలు తురుముకుని  మోమున మధుమాస దరహాస చంద్రికల్ని పులుముకుని  మేడలో పచ్చల హారం వేసుకుని  కొత్తగా .. సరి కొత్తగా  చైత్ర మాస వసంత లక్ష్మి గా   అంబరమంటే సంబరంతో  ఒక చేత శుభమూలనొసగే  పూర్ణ […]

ఉగాది వసంత లక్ష్మి

              —–నరెంద్రబాబు గుండాలHappy Ugadi

ప్పటిలాగే … ఈ యేడాది కూడా 

తెలుగు సంవత్సరాది ఉగాది 
నిరాశా  నిస్పృహ లని  పండుటాకుల్లా రాల్చి 
నవ నవ లాడే లేలేత చిగురాకుల చీర చుట్టుకొని 
నుదుటున తూరుపుసింధూరాన్ని దిద్దుకుని
 శిగలో  సిరి మల్లెలు తురుముకుని 
మోమున మధుమాస దరహాస చంద్రికల్ని పులుముకుని 
మేడలో పచ్చల హారం వేసుకుని 
కొత్తగా .. సరి కొత్తగా  చైత్ర మాస వసంత లక్ష్మి గా  
అంబరమంటే సంబరంతో 
ఒక చేత శుభమూలనొసగే  పూర్ణ కుంభాన్ని ధరించి 
తెలిగింటి మాగాణానికి .. మహా రాణి వలె తరలి వస్తోన్న 
శుభ వేళ 
మామిడి తోరణాలతో .. మంగళ వాయిద్యాలతో 
కమ్మని కోకిల స్వాగత గీతాలతో ,కవి సమ్మేళనాలతో .. 
పంచాంగ శ్రవణాలతో .. పంచ భక్ష్య పరమాన్నాలతో .. 
తెలుగు సంస్కృతి  సాంప్రదాయాల .. సమాహారాలతో .. 
సాదరం గా ఎదురేగి ప్రతి తెలుగు హృదయం 
ఉగాది లక్ష్మికి పలుకుతోంది నిండు మనస్సుతో 
కర్పూర హారతుల ఆహ్వానం !!
338 Comments
Leave a Reply

— required *

— required *

Theme by Design-Destination, powered by Design-Destination.