ఇరుగు-పొరుగు
February 9, 2015 | by admin
ఇరుగు-పొరుగు [లేడీస్ స్పెషల్ ]

ఇరుగు-పొరుగు  —-పాలపర్తి సంధ్య  మనిషి సంఘ జీవి . అందులోని భాగంగానే ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకు రకరకాల   వ్యక్తులతో కలిసి మాట్లాడ వలసి వస్తుంది .కొంత మంది తో పరిచయాలు మరికొంత మందితో స్నేహ బాంధవ్యాలు పెరుగుతూ వుంటాయి   ,ఇక పక్కింటి వారు ఎదురింటి వారు ఐతే వారితో బాంధవ్యాలు చెప్పనవసరం లేదు .వంటింటి  కబుర్ల దగ్గర్నుంచి మాట్లాడుకొని విషయం అంటూ ఉండదు.ఏ  కష్టం వచ్చిన సంతోషం కలిగిన ముందుగా వారితోనే పంచుకుంటాము .    […]

ఇరుగు-పొరుగు  —-పాలపర్తి సంధ్య 

మనిషి సంఘ జీవి . అందులోని భాగంగానే ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకు రకరకాల   వ్యక్తులతో కలిసి మాట్లాడ వలసి వస్తుంది .కొంత మంది తో పరిచయాలు మరికొంత మందితో స్నేహ బాంధవ్యాలు పెరుగుతూ వుంటాయి   ,ఇక పక్కింటి వారు ఎదురింటి వారు ఐతే వారితో బాంధవ్యాలు చెప్పనవసరం లేదు .వంటింటి  కబుర్ల దగ్గర్నుంచి మాట్లాడుకొని విషయం అంటూ ఉండదు.ఏ  కష్టం వచ్చిన సంతోషం కలిగిన ముందుగా వారితోనే పంచుకుంటాము . 

 
ఇట్లా  సాన్నిహిత్యం పెరిగినపుడు ఒకరి ఇంట్లో వంటలు  మరొకరి ఇంట్లో కి వెళ్ళటం పొరుగుంటి పుల్లకూర రుచులను ఆస్వాదించటం జరుగుతూ ఉంటాయి ,కొత్త వంటకం ఏది చేసిన పక్క వారికీ తప్పక పంపించ వలసిందే . 
కొంతమంది పొరుగు వారినుంచి వంటకాలు అందుకున్నపుడు తిరిగి వారికీ ఖాలీ గిన్నెలు ఇస్తు ఉంటాము . బదులుగా తిరిగి వారికి ఏమైనా ఇవ్వాలనే ఆలోచనచాలా  మందికి రాదు ఇవ్వాలని అనిపించినా  వైవిధ్యమైన వంటలు రాక కొందరు,సమయం దొరక్క కొందరు  ఖాలీ గిన్నేలనే తిరిగి ఇస్తూ ఉంటారు 
అలాకాకుండా మీరు రోజు వండుకునే వంటల్లోనే ఏమైనా ప్రత్యేకంగా ఉన్న వంటను  కొంచం ఎక్కువగా చేసి వారికి పంపండి ,
 
షాపింగ్ కి వెళ్ళినపుడు మీరు ఎలాగు తినుబండారాలను కొనుక్కుంటారు 
వాటినే కాస్త ఎక్కువ కొనండి . పండ్లు ఐతే మీతో మంచి సత్సంబంధాలు కలిగి ఉన్నవారికి శ్రేయోభిలాశులకి ఇవ్వండి.  సేజనల్  పండ్లు ఐతే సంవృద్దిగా  వస్తాయి కాబట్టి అందుబాటు ధరలలోనే మీరు కొనే అవకాశం  ఉంటుంది .వారికి మీరు ,మీకు వారు ఏమిచ్చారు  అన్నది కాదు ప్రశ్న.  మీరు ఎలా స్పందించారు అన్నది  ముఖ్యం .  మన పరిధిలో మనం ఉంటూనే ఇరుగు పొరుగు వారితో వంటింటి అనుబంధంమైన వస్తువాలతో స్నేహం చేయవచ్చు  . మంచి స్నేహం ఏ రూపం లో ఉన్న ఆహ్వనించతగినదే. 
1,297 Comments