ఆరోగ్యానికి మునగాకు
July 4, 2015 | by admin
ఆరోగ్యానికి మునగాకు

ఆరోగ్యానికి మునగాకు   మునగ  ఆకు గురించి ఈ తరం వారిలో చాలామందికి తెలియకపోవటం ఆశ్చర్యకరమే. గృహవైద్యంలో ములగ ఆకు ఎంత ప్రధానమైనదో మన బామ్మలకు, అమ్మమ్మలకు, గ్రామీణ ప్రజానీకానికి బాగా తెలుసు.  పిండి, కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండి, పీచు పదార్థాలు పుష్కలంగా ఉండే సర్వరోగ నివారిణి ‘మునగాకు”. దీన్ని మెత్తగా నూరి, మరుగుతున్న నీటిలో వేసి, మూతపెట్టి ఐదు నిమిషాల తరువాత దించేయాలి. కాస్తంత చల్లారిన తరువాత వడగట్టి ఉప్పు, మిరియాల పొడి చేర్చి సూప్‌లాగా తీసుకోవచ్చు. […]

ఆరోగ్యానికి మునగాకు 

 మునగ  ఆకు గురించి ఈ తరం వారిలో చాలామందికి తెలియకపోవటం ఆశ్చర్యకరమే. గృహవైద్యంలో ములగ ఆకు ఎంత ప్రధానమైనదో మన బామ్మలకు, అమ్మమ్మలకు, గ్రామీణ ప్రజానీకానికి బాగా తెలుసు.  పిండి, కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండి, పీచు పదార్థాలు పుష్కలంగా ఉండే సర్వరోగ నివారిణి ‘మునగాకు”. దీన్ని మెత్తగా నూరి, మరుగుతున్న నీటిలో వేసి, మూతపెట్టి ఐదు నిమిషాల తరువాత దించేయాలి. కాస్తంత చల్లారిన తరువాత వడగట్టి ఉప్పు, మిరియాల పొడి చేర్చి సూప్‌లాగా తీసుకోవచ్చు. మునగాకు రసం, తేనె, కొబ్బరినీరు కలిపి చిన్న కప్పు చొప్పున ప్రతిరోజూ రెండు లేదా మూడుసార్లు తీసుకుంటే నీళ్ల విరేచనాలు, రక్త విరేచనాలు, కాలేయ సమస్యలు తగ్గుతాయి. కామెర్లు ఉన్నవారు ప్రతి రోజూ చెంచాడు మునగాకు రసాన్ని, రెండు చెంచాల కొబ్బరి నీటిలో కలిపి వారం రోజుల పాటు క్రమం తప్పకుండా తీసుకుంటే త్వరగా కోలుకుంటారు. అధిక బరువు, మధుమేహం ఉన్నవారు ఎండబెట్టిన మునగాకు పొడిని తేనెతో కలిపి చెంచా చొప్పున ప్రతిరోజూ భోజనానికి ముందు తీసుకుంటే ఫలితం ఉంటుంది. మునగాకు రసం తీసి గ్లాసులో తేరబెట్టి దానికి తేనె కలిపి తాగితే గొంతులో పుండ్లు కంఠరోగాలు, కాలేయంలోని అల్సర్లు తగ్గుతాయి. ములగ ఆకులో ఉన్నంతగా ఎ, సి విటమిన్లు మరే ఇతర ఆకుకూరలోను లేవు. సున్నము, భాస్వరము, ఇనుము తగినంతగా ఉన్నాయి. మునగాకు రసంలో నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకుంటే మొటిమలు తగ్గుతాయి. పిల్లలు ఆరోగ్యంగా ఎదిగేందుకు కూడా మునగాకు రసం ఎంతగానో తోడ్పడుతుంది. మునగాకు పోషకవిలువలు ఈ క్రింది విధంగా ఉంటాయి. (100 గ్రా||లకి)
నీరు-75.9%       కాల్షియం-440 మి.గ్రా.
మాంసకృత్తులు-6.7%      పాస్ఫరస్‌-70 మి.గ్రా.
కొవ్వుపదార్థాలు-1.7%       ఇనుము-7 మి.గ్రా.
పీచుపదార్థం    -0.9%      ‘సి’ విటమిను-220 మి.గ్రా.
ఖనిజలవణాలు-2.3%      కొద్దిగా ‘బి’ కాంప్లెక్సు
పిండిపదార్థాలు-12.57% కాలరీలు-92

 మన ఇంటి చుట్టు పక్కల  దొరికే ఆకే కదా అని మునగాకుని చిన్న చూపు చూడకుండా మన ఆహరం లో మునగాకుని  చేర్చుకుని ఆరోగ్యాన్ని పొందుతాము.   
1,298 Comments